Share News

హ్యాట్రిక్‌పై గాయత్రి జోడీ గురి

ABN , Publish Date - Nov 24 , 2026 | 02:55 AM

వరుసగా మూడోసారి టైటిల్‌ సాధించడమే లక్ష్యంగా మహిళల డబుల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గాయత్రి గోపీచంద్‌/ట్రీసా జాలీ జోడీ.. మంగళవారం ఇక్కడ ప్రారంభమయ్యే సయ్యద్‌ మోదీ బ్యాడ్మింటన్‌ టోర్నీ బరిలో..

హ్యాట్రిక్‌పై గాయత్రి జోడీ గురి

  • నేటినుంచి సయ్యద్‌ మోదీ బ్యాడ్మింటన్‌

లఖ్‌నవూ: వరుసగా మూడోసారి టైటిల్‌ సాధించడమే లక్ష్యంగా మహిళల డబుల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గాయత్రి గోపీచంద్‌/ట్రీసా జాలీ జోడీ.. మంగళవారం ఇక్కడ ప్రారంభమయ్యే సయ్యద్‌ మోదీ బ్యాడ్మింటన్‌ టోర్నీ బరిలో దిగుతోంది. అయితే టాప్‌స్టార్లు సింధు, లక్ష్యసేన్‌, శ్రీకాంత్‌, సాత్విక్‌/చిరాగ్‌ ద్వయం ఈ సూపర్‌ 300 టోర్నీలో పాల్గొనడంలేదు. గత రెండేళ్లుగా విజేతగా నిలుస్తున్న గాయత్రి/ట్రీసా జాలీ జంట మూడోసారి కూడా టైటిల్‌ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. దేవికా సిహాగ్‌, తన్వీశర్మ, అస్మితా చాలిహా, రక్షితా రామ్‌రాజ్‌, ఉన్నతి, మాన్సీ సింగ్‌, ఆకర్షీ కశ్యప్‌, అనుపమా ఉపాధ్యాయ, మాళవికా బన్సోడ్‌ మహిళల సింగిల్స్‌లో తలపడుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌, తరుణ్‌, కిరణ్‌ జార్జ్‌, మిథున్‌ మంజునాథ్‌ తదితరులు పోటీపడుతున్నారు. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్‌ అర్జున్‌/హరిహరన్‌, మిక్స్‌డ్‌లో ధ్రువ్‌ కపిల/తనీషా, రోహన్‌ కపూర్‌/రుత్విక శివానీ గద్దె బరిలో నిలిచారు.

Updated Date - Nov 24 , 2026 | 02:57 AM