Share News

ఆసియాడ్‌ జట్టులో నలుగురు తెలుగు ఆర్చర్లు

ABN , Publish Date - May 19 , 2026 | 01:19 AM

ఆసియా క్రీడల్లో తలపడే కాంపౌండ్‌, రికర్వ్‌ ఆర్చరీ జట్లను సోమవారం ప్రకటించారు. హరియాణాలోని సొనెపట్‌లో జరిగిన తుది ఎంపిక పోటీల తర్వాత జట్లను...

ఆసియాడ్‌ జట్టులో నలుగురు తెలుగు ఆర్చర్లు

జ్యోతి సురేఖ, ధీరజ్‌, చికిత, గణేశ్‌కు చోటు

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో తలపడే కాంపౌండ్‌, రికర్వ్‌ ఆర్చరీ జట్లను సోమవారం ప్రకటించారు. హరియాణాలోని సొనెపట్‌లో జరిగిన తుది ఎంపిక పోటీల తర్వాత జట్లను భారత ఆర్చరీ సమాఖ్య (ఏఏఐ) ఎంపిక చేసింది. పోటీలో రెండు విభాగాలలో టాప్‌-3లో నిలిచిన ఆర్చర్లను ఆసియా క్రీడలకు ఎంపిక చేశారు. ఈ జట్లలో ఏకంగా నలుగురు తెలుగు ఆర్చర్లు..జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్‌, తానిపర్తి చికిత, తిరుమూరు గణేశ్‌లకు చోటు లభించడం విశేషం. కాంపౌండ్‌ జట్టు ఎంపిక పోటీలలో టాప్‌లో నిలిచిన సురేఖ మరో తెలుగు ఆర్చర్‌ చికిత, ప్రీతిక ప్రదీప్‌ ఎంపికయ్యారు. కాంపౌండ్‌ పురుషుల జట్టులో సాహిల్‌ జాదవ్‌, కుశాల్‌, గణేశ్‌ తలపడతారు..రికర్వ్‌ పురుషుల జట్టుకు ధీరజ్‌ ఎంపికయ్యాడు. వెటరన్లు అతాను దాస్‌, దీపికా కుమారి, అభిషేక్‌ వర్మ టాప్‌-3లో నిలవడంలో విఫలమయ్యారు. రికర్వ్‌ మహిళల జట్టులో టీనేజర్లు కీర్తిశర్మ, కుమ్‌కుమ్‌ అనిల్‌ మోహోద్‌ టాప్‌-2లో నిలిచి చోటు దక్కించుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్

త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Updated Date - May 19 , 2026 | 01:19 AM