బెథెల్ బాదేశాడు
ABN , Publish Date - Jul 05 , 2026 | 04:53 AM
టీ20 వరల్డ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ గెలుపు రుచి చూడలేకపోతోం ది. ఐర్లాండ్ పర్యటనలో సిరీస్ కోల్పోయిన శ్రేయాస్ సేనకు ఇంగ్లండ్‌లోనూ కలిసిరావడం లేదు.
భారత్ ఖాతాలో మరో ఓటమి
వైభవ్ అరంగేట్రం
మాంచెస్టర్: టీ20 వరల్డ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ గెలుపు రుచి చూడలేకపోతోం ది. ఐర్లాండ్ పర్యటనలో సిరీస్ కోల్పోయిన శ్రేయాస్ సేనకు ఇంగ్లండ్‌లోనూ కలిసిరావడం లేదు. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో గెలుపు దిశగా సాగుతున్న వేళ.. జాకబ్ బెథెల్ (46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 నాటౌట్) మెరుపు ఆటతీరుతో భారత్‌కు షాకిచ్చాడు. దీంతో 4 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ సిరీ్‌సలో 1-0తో ఆధిక్యం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఇషాన్ (40 బంతుల్లో 6 ఫోర్లతో 49), అభిషేక్ (24 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), శ్రేయాస్ (22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 37), తిలక్ వర్మ (11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 24 నాటౌట్) రాణించారు. సామ్ కర్రాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసి గెలిచింది. బ్రూక్ (15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 39), బాంటన్ (32 బంతుల్లో 6 ఫోర్లతో 39) ఆకట్టుకున్నారు. అర్ష్‌దీ్‌పనకు మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా బెథెల్ నిలిచాడు. భారత్ తరఫున శాంసన్ స్థానంలో 15 ఏళ్ల వైభవ్ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.
చివర్లో బాదుడు: పేసర్ అర్ష్‌దీప్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ సాల్ట్, బట్లర్‌లను డకౌట్లుగా పెవిలియన్‌కు చేర్చాడు. కానీ కెప్టెన్ బ్రూక్ ఆరంభంలో ఎదురుదాడికి.. బెథెల్ సూపర్ ఇన్నింగ్స్ జత కలవడంతో ఇంగ్లండ్ ఒత్తిడి లేకుండా గెలిచింది. మూడో ఓవర్‌లో బ్రూక్ 4,4,6,6,6తో 27 రన్స్ రాబట్టి అర్ష్‌దీ్‌పనకు ఝలక్ ఇచ్చాడు. కానీ ఐదో ఓవర్‌లో స్పిన్నర్ అక్షర్ అతడిని అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 24 బంతుల్లో 49 పరుగులు కావాల్సిన వేళ మ్యాచ్ భారత్‌వైపే మొగ్గు చూపించింది. కానీ 17వ ఓ వర్‌లో అంతా తారుమారైంది. బిష్ణోయ్‌ను చితకబాదేస్తూ బెథెల్ 29 ర న్స్ రాబట్టాడు.. దీంతో మరో ఓవర్ ఉండగానే భారత్ ఓటమి పాలైంది.
వైభవ్ విఫలం: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలో ఓపెనర్ అభిషేక్‌తో పాటు మధ్య ఓవర్లలో ఇషాన్, శ్రేయాస్ అండగా నిలిచారు. చివర్లో కాస్త తడబడినా.. తిలక్ ఫినిషింగ్‌తో జట్టు సవాల్ విసిరే స్కోరందుకుంది. ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వైభవ్ అరంగేట్రం ఈ మ్యాచ్‌తో తీరింది. అయితే తను ఎప్పటిలాగే ధాటిగా ఆడాలని చూసినా 10 బంతులకే పరిమితమయ్యాడు. రెండు సిక్సర్లతో ఆకట్టుకున్న వైభవ్ ఐదో ఓవర్‌లో స్టంపౌట్‌తో వెనుదిరిగాడు. అటు అభిషేక్ మాత్రం ధనాధన్ ఆటతో చెలరేగాడు. అయితే ఆరో ఓవర్ చివరి బంతికి వెనుదిరిగాడు. అప్పటికే పవర్‌ప్లేలో జట్టు 65/2 స్కోరుతో నిలిచింది. అనంతరం ఇషాన్, శ్రేయాస్ ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. చక్కగా కుదురుకున్న ఈ జోడీని 13వ ఓవర్‌లో డాసన్ విడదీశాడు. అతడు శ్రేయా్‌సను అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత స్కోరు కాస్త నెమ్మదించింది. దూబే (5), ఇషాన్ షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడ్డారు. ఇక వీరిద్దరితో పాటు అక్షర్ (2) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగాడు. కానీ చివరి ఓవర్‌లో తిలక్ చెలరేగి 6,6,4 బాది 17 రన్స్ రాబట్టడంతో స్కోరు 190కి చేరగలిగింది.
1 టీ20 అరంగేట్రంలో స్టంపౌట్ అయిన తొలి భారత బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ.
టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి భారత స్పిన్నర్‌గా అక్షర్ పటేల్.
భారత్‌పై టీ20ల్లో ఇంగ్లండ్‌కిదే అత్యధిక పరుగుల