Share News

ఆదిలోనే సవాల్‌

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:06 AM

డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ మంగళవారం ఇక్కడ ప్రారంభం కానుంది. భారత్‌ నుంచి బరిలో దిగుతున్న పీవీ సింధు, లక్ష్యసేన్‌కు ఆరంభంలోనే గట్టి ప్రత్యర్థులు ఎదురు నిలిచారు.

ఆదిలోనే సవాల్‌

  • సింధు, లక్ష్యకు క్లిష్టమైన డ్రా

  • నేటి నుంచి డెన్మార్క్‌ ఓపెన్‌

ఒడెన్స్‌ (డెన్మార్క్‌): డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ మంగళవారం ఇక్కడ ప్రారంభం కానుంది. భారత్‌ నుంచి బరిలో దిగుతున్న పీవీ సింధు, లక్ష్యసేన్‌కు ఆరంభంలోనే గట్టి ప్రత్యర్థులు ఎదురు నిలిచారు. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత సింధు మొదటి రౌండ్‌లో ప్రపంచ నెం.1, డిఫెండింగ్‌ చాంపియన్‌ అన్‌ సె యంగ్‌తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌ చౌ టీన్‌ చెన్‌ను లక్ష్యసేన్‌ ఢీకొననున్నాడు. ఇంకా..ఆయుష్‌ శెట్టి, కిడాంబి శ్రీకాంత్‌, తన్వీ శర్మ, అస్మిత చలిహా, దేవికా సిహాగ్‌, ఉన్నతి కూడా పోటీపడుతున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌/చిరాగ్‌ ద్వయం, మహిళల డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా జోడీ, రుతుపర్ణ/శ్వేతపర్ణ జంటలు తలపడుతున్నాయి.

Updated Date - Oct 13 , 2026 | 05:07 AM