కోర్టులో వినేశ్‌కు దక్కని ఊరట
ABN , Publish Date - May 19 , 2026 | 01:14 AM
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు కోర్టులోనూ ఊరట లభించలేదు. ఈనెల 30-31 తేదీలలో నిర్వహించే ఆసియా క్రీడల ఎంపిక పోటీల్లో పాల్గొనేలా తనకు...
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు కోర్టులోనూ ఊరట లభించలేదు. ఈనెల 30-31 తేదీలలో నిర్వహించే ఆసియా క్రీడల ఎంపిక పోటీల్లో పాల్గొనేలా తనకు అనుమతివ్వాలన్న వినేశ్ విన్నపాన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) వాదన వినకుండా వినేశ్ పిటిషన్ విషయంలో నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. జాతీయ ఎంపిక పోటీలలో పాల్గొనకుండా డబ్ల్యూఎ్‌ఫఐ తనపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ ఈనెల 14న వినేశ్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. సమాఖ్య ఎంపిక విధానాలను పరిశీలించకుండా వినేష్ పిటిషన్‌పై నిర్ణయానికి రాలేమని జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ పేర్కొన్నారు. అయితే వినేశ్‌కు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జూలై 6లోగా తార్కిక ముగింపు ఇస్తూ..ఆ నిర్ణయాన్ని తమకు తెలియజేయాలని డబ్ల్యూఎఫ్‌ఐకి సూచించారు. ఈమేరకు డబ్ల్యూఎ్‌ఫఐ, కేంద్ర ప్రభుత్వం, భారత ఒలింపిక్ సంఘానికి నోటీసులు జారీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్
త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్