Share News

Jemimah Rodrigues: కొత్త సారథి అదృష్టం తెచ్చేనా?

ABN , Publish Date - Jan 02 , 2026 | 05:58 AM

ఢిల్లీ క్యాపిటల్స్‌గతేడాదిని భారత మహిళా క్రికెట్‌ జట్టు అద్భుత విజయాలతో చిరస్మరణీయంగా ముగించింది. అంచనాలకు మించిన ఆటతీరుతో వన్డే వరల్డ్‌కప్‌ విజయంతో పాటు.....

Jemimah Rodrigues: కొత్త సారథి అదృష్టం తెచ్చేనా?

  • మహిళల ప్రీమియర్‌ లీగ్‌ మరో 7 రోజుల్లో

ఢిల్లీ క్యాపిటల్స్‌గతేడాదిని భారత మహిళా క్రికెట్‌ జట్టు అద్భుత విజయాలతో చిరస్మరణీయంగా ముగించింది. అంచనాలకు మించిన ఆటతీరుతో వన్డే వరల్డ్‌కప్‌ విజయంతో పాటు ద్వైపాక్షిక సిరీస్‌ విజయాలతో తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. అటు ప్లేయర్లు సైతం ప్రత్యర్థి జట్లపై సూపర్‌ ఫామ్‌తో విరుచుకుపడ్డారు. ఇక వీరంతా తమ జోరును ఫ్రాంచైజీ క్రికెట్‌ వైపు మళ్లించే వేళైౖంది. ఈనెల 9 నుంచి ఆరంభమయ్యే మహిళల ప్రీమియర్‌ లీగ్‌ నాలుగో సీజన్‌ కోసం తమ సహచరులపైనే సవాల్‌ విసిరేందుకు సిద్ధం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో లీగ్‌లోని ఐదు జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ బలాబలాలపై దృష్టి సారిస్తే..

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ఇప్పటి వరకు జరిగిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ రెండుసార్లు, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఓసారి విజేతగా నిలిచాయి. అయితే ఈ మూడుసార్లు తుది పోరులో వీరికి ప్రత్యర్థిగా నిలిచిన జట్టు మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒక్కటే కావడం గమ నార్హం. మెగ్‌ లానింగ్‌ నేతృత్వంలో బరిలోకి దిగిన డీసీ ప్రతిసారీ ఫైనల్‌కు చేరింది. కానీ విజేతగా మాత్రం మారలేకపోయింది. ఈసారి జెమీమా రోడ్రిగ్స్‌ జట్టు అదృ ష్టాన్ని మార్చాలనుకుంటోంది. వేలానికి ముందే లానింగ్‌ ను విడుదల చేసిన డీసీ తిరిగి ఆమెను దక్కించు కోవడంలో విఫలమైంది. దీంతో ఆది నుంచీ జట్టుతో పా టే ఉన్న జెమీమాకు ఈసారి సారథ్య బాధ్యతలు అప్పగించింది.

బ్యాటింగే బలం: ఎప్పటిలాగే డీసీ జట్టు బ్యాటింగ్‌ బలంతో ప్రత్యర్థి జట్లకు సవాల్‌ విసరనుంది. ఇటీవలి వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ను విజేతగా నిలపడంతో జెమీమాతో పాటు ఓపెనర్‌ షఫాలీ వర్మ కూడా కీలకంగా నిలిచింది. ఈ ఇద్దరూ డీసీలోనే ఉండడం జట్టుకు సాను కూలాంశం. అలాగే శ్రీలంకతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో ఈ ద్వయం ఫామ్‌ను చాటుకున్నారు. అలాగే షఫాలీకి తోడు మరో ఓపెనర్‌ లారా వోల్వార్ట్‌ పవర్‌ప్లేలో వేగంగా ఆడే సత్తావుంది. మారిజానా కాప్‌తో పాటు పేస్‌ ఆల్‌రౌండర్‌ చినెల్లె హెన్రీ చివర్లో భారీ షాట్లు ఆడగలదు. 16 ఏళ్ల బ్యాటర్‌ దియా యాదవ్‌ ఈసారి అందరి దృష్టిని ఆకర్షించనుంది. అంతేకాకుండా స్పిన్నర్‌ శ్రీచరణి మధ్య ఓవర్లలో రన్స్‌ను కట్టడి చేయడంతో పాటు వికెట్లు తీయగలగడం జట్టుకు లాభించేదే.

సదర్లాండ్‌ దూరం: వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు ఆల్‌రౌండర్‌ సదర్లాండ్‌ దూరం కావడం డీసీకి గట్టి దెబ్బే. రూ.2.2 కోట్లతో ఈసారి తనను జట్టు రిటైన్‌ చేసుకుంది. అలాగే గతేడాది సదర్లాండ్‌ ఏడు వికెట్లు తీసి జట్టును ఫైనల్‌కు చేర్చగలిగింది. తన స్థానంలో ఆసీస్‌కే చెందిన స్పిన్నర్‌ అలనా కింగ్‌ను తీసుకున్నారు. అలాగే జట్టు విదేశీ పేసర్లపైనే అతిగా ఆధారపడింది. ఒకవేళ సీనియర్లు గాయపడితే జట్టులోని దేశవాళీ ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుని ప్రభావం చూపడం కష్టమే.

Updated Date - Jan 02 , 2026 | 05:58 AM