Share News

కెరీర్‌కు ఇదే చివరి ఏడాది!

ABN , Publish Date - Aug 18 , 2026 | 05:40 AM

పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో (41) తన రిటైర్మెంట్‌పై బాంబు పేల్చాడు. తన కెరీర్‌లో ఇదే చివరి సీజన్‌ అని చెప్పాడు. 25 ఏళ్ల కెరీర్‌లో రొనాల్డో పలు అత్యున్నతస్థాయి..

కెరీర్‌కు ఇదే చివరి ఏడాది!

రిటైర్మెంట్‌పై రొనాల్డో

న్యూఢిల్లీ: పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో (41) తన రిటైర్మెంట్‌పై బాంబు పేల్చాడు. తన కెరీర్‌లో ఇదే చివరి సీజన్‌ అని చెప్పాడు. 25 ఏళ్ల కెరీర్‌లో రొనాల్డో పలు అత్యున్నతస్థాయి టోర్నీలలో అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించాడు. వచ్చే ఏడాది జూన్‌లో సౌదీ అరేబియాకు చెందిన అల్‌ నాసర్‌ క్లబ్‌తో రొనాల్డో కాంట్రాక్ట్‌ ముగియనుంది. అనంతరం అతడు ఆటకు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత ఏం చేయాలనుకొంటున్నది ముందుగానే ప్లాన్‌ చేసుకొన్నట్టు తెలిపాడు. ‘నన్ను బిజీగా ఉంచుకొనేందుకు ఎన్నో ప్రణాళికలు వేసుకొన్నా. వాటి గురించి చెప్పడం కష్టం. నా జీవితంలో ఫుట్‌బాల్‌ లేని లోటును పూడ్చడం అంత సులువుకాదు. కుటుంబంతో కలసి సరదాగా గడపడంతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించాలనుకొంటున్నా’ అని అన్నాడు.

Updated Date - Aug 18 , 2026 | 05:40 AM