Share News

అవును..రొనాల్డో, జార్జినా పెళ్లి చేసుకున్నారు!

ABN , Publish Date - Aug 13 , 2026 | 05:28 AM

దశాబ్దకాలంగా సహజీవనం చేస్తున్న పోర్చుగల్‌ సాకర్‌ సూపర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో (41), అర్జెంటీనా మోడల్‌ జార్జినా రోడ్రిగ్స్‌ (32) పెళ్లి చేసుకున్నారు.

అవును..రొనాల్డో, జార్జినా పెళ్లి చేసుకున్నారు!

లిస్బన్‌ (పోర్చుగల్‌): దశాబ్దకాలంగా సహజీవనం చేస్తున్న పోర్చుగల్‌ సాకర్‌ సూపర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో (41), అర్జెంటీనా మోడల్‌ జార్జినా రోడ్రిగ్స్‌ (32) పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుక పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌కు సమీపంలోని తీరప్రాంత పట్టణం కాస్కై్‌సలో మంగళవారం జరిగింది. తమ ఐదుగురు పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు ఈ పెళ్లికి హాజరయ్యారు. మార్చుకున్న ఉంగరాల ఫొటోలను రొనాల్డో, జార్జియా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. కాగా మాడ్రిడ్‌లోని ఓ స్టోర్‌లో జార్జినా పని చేస్తున్న సమయంలో రొనాల్డోతో ఆమెకు పరిచయమేర్పడింది. అది ప్రేమగా మారి 2016 నుంచి వారిద్దరూ రిలేషన్‌షి్‌పలో ఉన్నారు. ఈ క్రమంలో వారికి ఇద్దరు ఆడపిల్లలు కలిగారు. అంతకుముందు రొనాల్డోకు ముగ్గురు పిల్లలున్నారు. కానీ వారి తల్లి ఎవరన్నది మాత్రం క్రిస్టియానో ఎప్పుడూ బహిర్గతం చేయలేదు.

Updated Date - Aug 13 , 2026 | 05:28 AM