Share News

పురుషుల జట్టు గెలుపు

ABN , Publish Date - Sep 27 , 2026 | 02:25 AM

ప్రతిష్ఠాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు జోరు కొనసాగిస్తూ 10వ రౌండ్‌లో విజయం అందుకుంది....

పురుషుల జట్టు గెలుపు

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత మహిళలకు డ్రా

సమర్‌ఖండ్‌ (ఉజ్బెకిస్థాన్‌): ప్రతిష్ఠాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు జోరు కొనసాగిస్తూ 10వ రౌండ్‌లో విజయం అందుకుంది. అయితే మహిళల జట్టు చైనాతో డ్రా చేసుకుంది. ఓపెన్‌ విభాగంలో శనివారంనాటి రౌండ్‌లో పురుషులు 3.5-.05తో ఉజ్బెకిస్థాన్‌-2 జట్టును చిత్తు చేశారు. ప్రపంచ చాంపియన్‌ గుకేష్‌, నిహాల్‌ సరిన్‌, ప్రజ్ఞానంద ప్రత్యర్థులపై గెలుపొందారు. అర్జున్‌ ఇరిగేసి తన గేమ్‌ను డ్రాగా ముగించాడు. మహిళల విభాగంలో ఉత్కంఠగా సాగిన పోరులో భారత్‌, చైనా 2-2తో సమంగా నిలిచాయి. సవితా శ్రీ నెగ్గగా, హంపి, దివ్యా దేశ్‌ముఖ్‌ ప్రత్యర్థులతో పాయింట్‌ పంచుకున్నారు. వంతిక అగర్వాల్‌ పరాజయం చవిచూసింది. టోర్నీలో మరో రౌండే మిగిలుండగా ఓపెన్‌లో ఉజ్బెకిస్థాన్‌-1 జట్టు (18 పాయింట్లు) టాప్‌లో కొనసాగుతుండగా, భారత్‌ (17) రెండో స్థానంలో నిలిచింది. మహిళల్లో చైనా (18), కజకిస్థాన్‌ (17), భారత్‌ (16) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 27 , 2026 | 02:26 AM