Share News

అఫ్ఘాన్‌ లక్ష్యం 479

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:16 AM

అఫ్ఘానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ పట్టు బిగించింది. ఆటకు నాలుగో రోజు బంగ్లా నిర్దేశించిన 479 పరుగుల లక్ష్య ఛేదనలో.. అఫ్ఘాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 132/3 స్కోరు చేసింది.

అఫ్ఘాన్‌ లక్ష్యం 479

  • ప్రస్తుతం 132/3

  • బంగ్లాతో ఏకైక టెస్ట్‌

అబుధాబి: అఫ్ఘానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ పట్టు బిగించింది. ఆటకు నాలుగో రోజు బంగ్లా నిర్దేశించిన 479 పరుగుల లక్ష్య ఛేదనలో.. అఫ్ఘాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 132/3 స్కోరు చేసింది. సోమవారం ఆట ఆఖరుకు సెదికుల్లా అటల్‌ (35), హస్మతుల్లా షాహిది (19) క్రీజులో ఉన్నారు. కెప్టెన్‌ రహ్మత్‌ షా (51) అర్ధ శతకం సాధించాడు. ఆఖరి రోజు విజయానికి అఫ్ఘాన్‌ 347 పరుగుల దూరంలో ఉండగా.. బంగ్లాకు 7 వికెట్లు కావాలి. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 226/6తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లా 372/7 వద్ద డిక్లేర్‌ చేసింది. లిటన్‌దాస్ (102) సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 346, అఫ్ఘాన్‌ 240 రన్స్‌ చేశాయి.

Updated Date - Oct 13 , 2026 | 05:17 AM