పోరాడుతున్న దక్షిణాఫ్రికా
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:11 AM
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా ఓటమి దిశగా సాగుతోంది. 421 పరుగుల భారీ ఛేదన కోసం బరిలోకి..
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు
డర్బన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా ఓటమి దిశగా సాగుతోంది. 421 పరుగుల భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన సఫారీలు నాలుగో రోజు సోమవారం ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 102/4 స్కోరుతో నిలిచారు. బెడింగమ్ (46), ఓపెనర్ మార్‌క్రమ్ (45 బ్యాటింగ్) రాణించారు. హాజెల్‌వుడ్‌కు 2 వికెట్లు లభించాయి. ఆఖరి రోజైన మంగళవారం సఫారీలు మరో 319 పరుగులు సాధించాలి. చేతిలో 6 వికెట్లే ఉన్నాయి. అంతకుముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 314/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఆసీస్‌కు 420 పరుగుల ఆధిక్యం దక్కింది. రెన్‌షా (82), మాడిసన్ (48), వెబ్‌స్టర్ (39) రాణించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 390, సఫారీలు 284 రన్స్ చేశారు.