Share News

నిప్పులు చెరిగిన స్టార్క్.. 64 పరుగులకే బంగ్లా ఆలౌట్

ABN , Publish Date - Aug 22 , 2026 | 10:13 AM

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ 64 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆసీస్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్‌ దెబ్బకు బంగ్లా బ్యాట‌ర్లు విల‌విల్లాడిపోయారు.

నిప్పులు చెరిగిన స్టార్క్.. 64 పరుగులకే బంగ్లా ఆలౌట్

స్పోర్ట్స్ డెస్క్: మాకే వేదిక‌గా రెండో టెస్టులో బంగ్లాదేశ్ కు ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాకిచ్చింది. తొలి టెస్టులో ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ విజృంభించాడు. అతడి దెబ్బకు బంగ్లాదేశ్ 64 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. స్టార్క్‌, క‌మిన్స్ బంతితో నిప్పులు చెర‌గ‌డంతో బంగ్లా బ్యాట‌ర్లు విల‌విల్లాడిపోయారు. షోరిఫుల్ ఇస్లామ్ 14 పరుగులతో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అలానే న‌లుగురు బంగ్లా బ్యాట‌ర్లు ఖాతా తెరవకుండానే వెనుదిర‌గ‌డం గ‌మ‌నార్హం. మ‌రో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమిత‌మ‌య్యారు.

Updated Date - Aug 22 , 2026 | 10:14 AM