క్వార్టర్స్‌కు సింధు, ఉన్నతి
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:11 AM
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో ఏస్ షట్లర్ పీవీ సింధు, ఉన్నతి హుడా సింగి ల్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకోగా.. లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో...
నగోయ: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో ఏస్ షట్లర్ పీవీ సింధు, ఉన్నతి హుడా సింగి ల్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకోగా.. లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో సింధు 21-9, 21-13తో టొమాక మియాజకిను, ఉన్నతి 21-19, 21-13తో కుసుమ వర్ధినిని ఓడించారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ 12-21, 21-15, 14-21తో లో కీన్ యు చేతిలో, ఆయుష్ 16-21, 21-19, 17-21తో చో టిన్ చెస్ చేతిలో ఓడారు. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి జంట 24-22, 21-18తో జపాన్ జోడీ ఫుకుషిమా-మట్సుమోటోపై గెలుపొంది క్వార్టర్స్ చేరింది.
హాకీ సెమీ్‌సలో పురుషులు: భారత పురుషుల హాకీ జట్టు సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకొంది. పూల్-ఎ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-0తో జపాన్‌పై గెలిచింది. అభిషేక్ (15వ), హర్మన్‌ప్రీత్ (40వ) గోల్స్ చేశారు.
ఈక్వెస్ట్రియన్‌లో ఫైనల్‌కు: జై సుడ్, హ్రిదయ్ విపుల్ చెద్దా ఈక్వెస్ర్టియన్ వ్యకిగత డ్రెస్సేజ్ ఈవెంట్ ఫైనల్‌కు చేరారు.
బాక్సింగ్‌లో కపిల్, ప్రియ ముందంజ భారత బాక్సర్లు కపిల్ పొఖారియా (90 కిలోలు), ప్రియ ఘంఘాస్ (60 కి) క్వార్టర్స్‌కు చేరుకోగా.. జాదూమణి సింగ్ (55 కి) ఓటమితో ఇంటిముఖం పట్టాడు.
ఆర్చరీ టాప్‌లో ధీరజ్, చికిత తెలుగు ఆర్చర్లు ధీరజ్ బొమ్మదేవర, చికితా తానిపర్తి రాణించడంతో ఆర్చరీ ఈవెంట్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ధీరజ్ 698 పాయుంట్లతో ఆసియా గేమ్స్ రికార్డుతో టాప్‌లో నిలిచాడు. దీంతో అతడికి నేరుగా రెండో రౌండ్‌కు బై లభించింది. ధీరజ్ అద్భుత ప్రదర్శనతో రికర్వ్ టీమ్, మిక్స్‌డ్ ఈవెంట్లలో భారత్ రెండో స్థానం దక్కించుకొంది. మిక్స్‌డ్ అర్హత పోటీల్లో ధీరజ్, కుమ్‌కుమ్ జోడీ రెండో స్థానం సొంతం చేసుకొంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం అర్హత ఈవెంట్‌లో చికిత 705 పాయింట్లతో టాప్‌లో నిలవగా.. జ్యోతి సురేఖ (699), ప్రీతిక (695) 12, 20వ స్థానాల్లో నిలిచారు. కాంపౌండ్ జట్టు రెండో సీడ్ దక్కించుకొంది. మిక్స్‌డ్ క్వాలిఫికేషన్‌లో చికిత, సాహిల్ జంట 1355 పాయింట్లతో టాప్‌లో నిలిచింది.
ఇవి కూడా చదవండి:
శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా
నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు