గాయంతో వైదొలగిన జ్యోతి
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:01 AM
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి మోకాలి నొప్పితో ఆసియా క్రీడల నుంచి వైదొలగింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో...
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి మోకాలి నొప్పితో ఆసియా క్రీడల నుంచి వైదొలగింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో ఆమె బరిలోకి దిగాల్సి ఉంది. అయితే, శనివారం వామప్ సమయంలో మోకాలి నొప్పితో ఇబ్బంది పడడంతో జ్యోతి తప్పుకోవాల్సి వచ్చింది. గత క్రీడల్లో జ్యోతి రజతం నెగ్గింది. ఇక ఆసియాడ్‌లో పురుషుల ట్రిపుల్ జంప్‌లో భారత అథ్లెట్ ప్రవీణ్ చిత్రవేల్ కూడా పోటీల నుంచి విరమించుకున్నాడు. తొలి జంప్‌లోనే ఫౌల్ చేసిన ప్రవీణ్.. ఆ తర్వాత గాయంతో ఈవెంట్ నుంచి వైదొలిగాడు. కాగా, చివరి నిమిషంలో ఫిట్‌నె్‌సపై క్లియరెన్స్ రావడంతోనే జ్యోతి, ప్రవీణ్‌లను ఆసియాడ్‌కు ఎంపిక చేశామనీ, కానీ ఇప్పుడు ఉన్నట్టుండి గాయాలపాలవడంపై నివేదిక కోరతామని భారత అథ్లెటిక్స్ సమాఖ్య తెలిపింది.
ఇవి కూడా చదవండి:
శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా
నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు