బ్యాడ్మింటన్‌లో పతకం ఖాయం
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:24 AM
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జట్టు సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకోగా.. మహిళల టీమ్ క్వార్టర్స్‌లో ఓడి ఇంటిముఖం పట్టింది. హోరాహోరీగా సాగిన...
నగోయ: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జట్టు సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకోగా.. మహిళల టీమ్ క్వార్టర్స్‌లో ఓడి ఇంటిముఖం పట్టింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌లో భారత్ 3-0తో జపాన్‌పై గెలిచింది. సింగిల్స్‌లో లక్ష్యసేన్, ఆయుష్ శెట్టితోపాటు డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి గెలిచారు. కాగా, భారత మహిళల జట్టు 1-3తో జపాన్ చేతిలో పరాజయం పాలైంది. సింగిల్స్‌లో పీవీ సింధు, ఉన్నతి హుడా ఓడడంతో భారత్ 0-2తో వెనుకబడింది. కానీ, మూడో మ్యాచ్‌లో డబుల్స్ జంట ట్రీసా జాలీ-గాయత్రి పుల్లెల జంట గెలిచి ఆశలు నిలిపింది. అయితే, నాలుగో మ్యాచ్‌లో తన్వీ శర్మ చిత్తవ్వడంతో భారత ఓటమి ఖరారైంది.
ఆసియాడ్‌కు అర్హత సాధించిన ఏకైక జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది.
టేబుల్ టెన్ని్‌సలో భారత పురుషులు, మహిళల జట్ల కథ ముగిసింది. మహిళల క్వార్టర్స్‌లో భారత్ 0-3తో ఉత్తరకొరియా చేతిలో ఓడింది. పురుషుల జట్టు రౌండ్- 16లో భారత్ 0-3తో ద.కొరియా చేతిలో ఓడింది.
స్విమ్మింగ్‌లో భారత అథ్లెట్ల దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. పురుషుల4్ఠ100 రిలే ఫైనల్లో భారత బృందం చివరి స్థానంలో నిలిచింది. 1500 మీ. ఫ్రీ స్టయిల్ ఫైనల్-బిలో ఆర్యన్ నెహ్రా నాలుగో స్థానం దక్కించుకొన్నాడు.
ఈక్వెస్ట్రియన్ డ్రస్సేజ్ ఈవెంట్‌లో భారత్ ఏడో స్థానంలో నిలిచింది. కాగా, జంపింగ్ ఈవెంట్‌లో ఎలిమినేట్ అయింది. కాగా, వ్యక్తిగత జంపింగ్ విభాగంలో ఆశిష్ లిమాయె ఆరో స్థానం దక్కించుకొన్నాడు.
పురుషుల ఫాయిల్ వ్యక్తిగత విభాగంలో హిమాష్ సింగ్ సనాసమ్ 5-1తో అల్ షుఅయిబి సయ్యద్‌పై నెగ్గగా.. 2-5తో చోంగ్ కియో చేతిలో ఓడాడు.
జుగ్‌రాజ్ సింగ్, స్ట్రయికర్లు అభిషేక్ సింగ్, దిల్‌ప్రీత్ హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించారు. దీంతో పూల్-ఎ హాకీ మ్యాచ్‌లో భారత్ 16-1తో శ్రీలంకను మట్టికరిపించింది.
ఉషు మహిళల 60 కిలోల సాండా విభాగంలో రోషిబినా దేవి సెమీస్ చేరి పతకం ఖాయం చేసింది. మహిళల నాన్‌క్వాన్, నాండో ఈవెంట్‌లో హన్జాబామ్ లాంగ్లెన్‌టోంబి దేవి ఫైనల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. సెపక్‌తక్రా రెగు గ్రూప్-బిలో భారత్ 0-3తో మలేసియా చేతిలో చిత్తయింది. పురుషుల కబడ్డీ గ్రూప్-ఎలో భారత్ 63-31తో కొరియాపై గెలిచింది.