Share News

ఆసియా క్రీడల సాంకేతిక అధికారిగా యలమంచిలి శ్రీకాంత్‌

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:10 AM

ఆంధ్ర కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్‌ ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో...

ఆసియా క్రీడల సాంకేతిక అధికారిగా యలమంచిలి శ్రీకాంత్‌

విజయవాడ స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్‌ ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాలు పంచుకోనున్నారు. ఈనెల 19 నుంచి జపాన్‌ వేదికగా జరిగే ఈ క్రీడలకు సాంకేతిక అధికారిగా శ్రీకాంత్‌ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ను మంత్రులు కొల్లు రవీంద్ర, రామ్‌ప్రసాద్‌ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌, వసంత కృష్ణప్రసాద్‌తో పాటు ఏపీ కబడ్డీ సంఘం చీఫ్‌ ప్రభావతి, కార్యవర్గం సభ్యులు అభినందించారు.

Updated Date - Sep 12 , 2026 | 06:10 AM