కాకతీయ, మరాఠాస్ గెలుపు
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:26 AM
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదో రోజు పోటీల్లో కాకతీయ నైట్స్, మైటీ మరాఠాస్, రాజ్‌పుతానా రాయల్స్ జట్లు విజయాలు సాధించాయి.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదో రోజు పోటీల్లో కాకతీయ నైట్స్, మైటీ మరాఠాస్, రాజ్‌పుతానా రాయల్స్ జట్లు విజయాలు సాధించాయి. సోమవారం నెక్లె్‌సరోడ్‌లో జరిగిన ఈ పోటీల్లో ఆతిథ్య కాకతీయ జట్టు 6-2తో పృథ్వీరాజ్ యోధా్‌సను చిత్తు చేసింది. అంతకుముందు మ్యాచ్‌ల్లో మైటీ మరాఠాస్ సడెన్ డెత్‌లో 2-1తో చీరో ఆర్చర్స్‌ను, రాజ్‌పుతానా రాయల్స్ 5-1తో చోళ చీఫ్స్‌ను ఓడించాయి.