అమరావతి చాంపియన్‌షి్‌ప 2.0కి శ్రీకారం
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:02 AM
అమరావతి చాంపియన్‌షి్‌ప 2.0 పోస్టర్‌ను శాప్ చైర్మన్ ఎ. రవినాయుడు సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు.
పోస్టర్ ఆవిష్కరించిన శాప్ చైర్మన్
విజయవాడ: అమరావతి చాంపియన్‌షి్‌ప 2.0 పోస్టర్‌ను శాప్ చైర్మన్ ఎ. రవినాయుడు సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈనెల 15న చాంపియన్‌షి్‌ప ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. అండర్-17, అండర్-23 విభాగాలలో బాస్కెట్‌బాల్, హాకీ, అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్, కబడ్డీ సహా 12 క్రీడాంశాలలో నియోజకవర్గంనుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు రూ.94 లక్షల నగదు బహుమతులు అందించనున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు ఈసారి విశ్వవిద్యాలయ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో శాప్ వీసీ, ఎండీ ఎన్.భరణి, శాప్ సభ్యురాలు రజని, గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తదితరులు పాల్గొన్నారు.