అమన్ స్వర్ణ పట్టు
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:09 AM
ఇక్కడ జరుగుతున్న సీనియర్ ర్యాంకింగ్ రెజ్లింగ్ టోర్నీ తొలిరోజే భారత్ స్వర్ణ బోణీ కొట్టింది. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కి. విభాగంలో...
బుడాపెస్ట్: ఇక్కడ జరుగుతున్న సీనియర్ ర్యాంకింగ్ రెజ్లింగ్ టోర్నీ తొలిరోజే భారత్ స్వర్ణ బోణీ కొట్టింది. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కి. విభాగంలో అమన్ సెహ్రావత్ టైటిల్ దక్కించుకున్నాడు. ఫైనల్లో 22 ఏళ్ల అమన్ 13-3తో రాబర్ట్ డింగాష్విలీ (జార్జియా)ని చిత్తు చేసి పసిడి పతకం అందుకున్నాడు. దీపక్ (61కి.), విశాల్ (65కి.) కాంస్య పతకాలు గెలుపొందారు.