Share News

జ్వెరెవ్‌.. నెంబర్‌ వన్‌

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:13 AM

ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) తన కెరీర్‌లో తొలిసారి సీజన్‌ను నెంబర్‌ వన్‌ ర్యాంక్‌తో ముగించనున్నాడు. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో టాప్‌..

జ్వెరెవ్‌.. నెంబర్‌ వన్‌

  • టాప్‌ ర్యాంక్‌తో సీజన్‌కు ముగింపు

షాంఘై: ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) తన కెరీర్‌లో తొలిసారి సీజన్‌ను నెంబర్‌ వన్‌ ర్యాంక్‌తో ముగించనున్నాడు. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో టాప్‌ ర్యాంక్‌లో ఉన్న యానిక్‌ సిన్నర్‌ గాయం కారణంగా ఈ సీజన్‌ మొత్తానికి దూరమవనున్నాడు. దీనికి తోడు తాజాగా జరుగుతున్న షాంఘై ఓపెన్‌లో మూడో ర్యాంకర్‌ అల్కారజ్‌ మూడో రౌండ్లోనే జిజౌ బెర్గ్స్‌ (బెల్జియం) చేతిలో ఓడాడు. దీంతో అటు సినర్‌ గాయం, ఇటు అల్కారజ్‌ ఓటమితో.. ప్రస్తుతం రెండో ర్యాంక్‌లోనున్న జ్వెరెవ్‌కు టాప్‌ ర్యాంక్‌ ఖరారైందని ఏటీపీ సోమవారం ప్రకటించింది. ఇక, వచ్చేనెలలో కూడా జ్వెరెవ్‌ టాప్‌ ర్యాంక్‌కు ఢోకా లేకపోవడంతో.. అతను ఈ ఏడాదిని నెంబర్‌వన్‌ ర్యాంకర్‌గా ముగించనున్నాడు. ఈ క్రమంలో సీజన్‌ను టాప్‌ ర్యాంక్‌తో ముగించనున్న పెద్ద వయస్కుడిగా 29 ఏళ్ల జ్వెరెవ్‌ అరుదైన రికార్డును కూడా అందుకోనున్నాడు.

Updated Date - Oct 13 , 2026 | 05:14 AM