హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ABN, Publish Date - Oct 19 , 2026 | 11:00 AM

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి జీ. కిషన్‌రెడ్డి నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 1/15

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి జీ. కిషన్‌రెడ్డి నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 2/15

హైదరాబాద్‌లోని న్యూ నల్లకుంట, ముషీరాబాద్, ఖైరతాబాద్‌లోని చింతల్ బస్తీ, యూసఫ్‌గూడ ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో కిషన్‌రెడ్డి పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, స్థానిక నాయకులు, మహిళలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 3/15

ఆయా కాలనీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పారు.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 4/15

న్యూ నల్లకుంటలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి సంప్రదాయ జానపద గీతాలు, నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 5/15

తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ పండుగలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 6/15

ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి కలగాలని కిషన్ రెడ్డి గౌరీ దేవిని ప్రార్థించారు.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 7/15

ముషీరాబాద్‌లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాల్లోనూ కేంద్రమంత్రి పాల్గొన్నారు. ప్రజల మధ్య బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 8/15

తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించిన మహిళలు, యువతులు సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల అస్తిత్వం, ఆత్మగౌరవం, శక్తికి ప్రతీకగా నిలుస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 9/15

ఖైరతాబాద్ పరిధిలోని చింతల్ బస్తీలో నిర్వహించిన వేడుకల్లో మహిళల భక్తిశ్రద్ధలు, సంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు ఆకట్టుకున్నాయి. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని బతుకమ్మ పండుగ సజీవంగా ఉంచుతుందని, ప్రజల మధ్య ఐక్యత, విశ్వాసం, ఆత్మీయతను పెంపొందిస్తుందని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 10/15

యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, కోలాటాలు, సంప్రదాయ పాటలతో గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజించారు.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 11/15

అనంతరం గౌరమ్మ తల్లికి వీడ్కోలు పలికారు. తెలంగాణకు ప్రత్యేకమైన ఈ పూల పండుగ అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చే సంప్రదాయ వేడుకగా నిలుస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 12/15

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 13/15

సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యత, సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించాయి.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 14/15

ఈ సందర్బంగా ప్రతి ఆడబిడ్డ కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సౌభాగ్యం వెల్లివిరియాలని అమ్మవారిని కోరుకున్నానని కిషన్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 15/15

ఈ పండుగ దేశంలో మన తెలంగాణకే ప్రత్యేకమైనదని.. అన్నివర్గాల ప్రజలు సంతోషంగా చేసుకునే పండుగగా బతుకమ్మకు ఘనమైన చర్రిత ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated at - Oct 19 , 2026 | 11:24 AM