తెలంగాణలో మొదలైన రాఖీ పండగ సందడి..
ABN, Publish Date - Aug 27 , 2026 | 09:00 PM
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది. రాజధాని హైదరాబాద్‌తోపాటు పట్టణాలు, జిల్లా కేంద్రాల వరకు రాఖీ దుకాణాలు, షాపింగ్ మాల్స్ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి.
1/10
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది. రాజధాని హైదరాబాద్‌తోపాటు పట్టణాలు, జిల్లా కేంద్రాల వరకు రాఖీ దుకాణాలు, షాపింగ్ మాల్స్ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి.
2/10
సోదరుల కోసం రాఖీలు కొనుగోలు చేసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో షాపింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది రాఖీ పండగను ఆగస్టు 28వ తేదీ శుక్రవారం జరుపుకోనున్నారు.
3/10
చిన్నారుల నుంచి మహిళల వరకు తమ అన్నదమ్ములకు నచ్చే రాఖీల కోసం వివిధ డిజైన్లను పరిశీలిస్తున్నారు.
4/10
రంగు రంగుల రాఖీలు, ముత్యాలు, పూసలు, సాంప్రదాయ డిజైన్లకు డిమాండ్ పెరిగింది.
5/10
అలాగే మహిళలు రాఖీలతోపాటు సోదరులకు ఇచ్చే బహుమతులు, స్వీట్లు కూడా కొనుగోలు చేస్తున్నారు.
6/10
దీంతో రాఖీ దుకాణాలతోపాటు గిఫ్ట్, స్వీట్ షాపుల్లో సందడి పెరిగింది.
7/10
రాఖీ పౌర్ణమి కేవలం ఓ పండుగ మాత్రమే కాదు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానుబంధానికి ప్రతీక.
8/10
సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి వారి ఆరోగ్యం, ఆయురారోగ్యాలను కోరుకుంటారు.
9/10
సోదరులు కూడా సోదరీమణులకు బహుమతులు అందిస్తూ తమ ప్రేమను చాటుకుంటారు.
10/10
మొత్తంగా గురువారం.. ఒక్కరోజు ముందు నుంచే మార్కెట్లలో కనిపిస్తున్న సందడి.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దం పడుతోంది.
Updated at - Aug 27 , 2026 | 09:19 PM