తలసేమియాతో చాలా మంది చిన్నారులు చనిపోతున్నారు: నారా భువనేశ్వరి
ABN, Publish Date - May 10 , 2026 | 04:07 PM
తలసేమియాతో చాలా మంది చిన్నారులు చనిపోతున్నారని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారిని కాపాడేందుకు రక్తమార్పిడి ఒక్కటే మార్గం అని ఆమె స్పష్టం చేశారు.
1/10
తలసేమియాతో చాలా మంది చిన్నారులు చనిపోతున్నారని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
2/10
ఈ సమస్యతో బాధపడుతున్న వారిని కాపాడేందుకు రక్తమార్పిడి ఒక్కటే మార్గం అని ఆమె స్పష్టం చేశారు.
3/10
రక్తదానం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలూ రావన్నారు.
4/10
దేశంలో ఏటా 12 వేలమంది తలసేమియాతో జన్మిస్తున్నారని చెప్పారు.
5/10
ఆదివారం నెక్లె్స్ రోడ్డులోని జలవిహార్ వద్ద తలసేమియా రన్‌ను జెండా ఊపి నారా భువనేశ్వరి ప్రారంభించారు.
6/10
తలసేమియా బాధితులకు రక్తదానం బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
7/10
యువత తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు.
8/10
విజయవాడ, అనంతపురంలో తలసేమియా కేంద్రాలు, బ్లడ్ బ్యాంక్‌లు ఉన్నాయని వివరించారు.
9/10
గత కొన్ని దశాబ్దాలుగా తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తాన్ని అందించడంతో పాటూ వారికి అవసరమైన వైద్య సేవలను ఎన్టీఆర్ ట్రస్ట్ నిరంతరం అందిస్తోందని నారా భువనేశ్వరి చెప్పారు.
10/10
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ట్రస్ ఎప్పుడూ ముందు ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే.
Updated at - May 10 , 2026 | 04:21 PM