యాదగిరీశుడికి తెలంగాణ నూతన గవర్నర్ ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Mar 12 , 2026 | 04:22 PM

యాదగిరిగుట్టలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం కోసం గురువారం ఉదయం యాదగిరిగుట్టకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతోపాటు ఆయన కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

యాదగిరీశుడికి తెలంగాణ నూతన గవర్నర్ ప్రత్యేక పూజలు 1/10

యాదగిరిగుట్టలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు.

యాదగిరీశుడికి తెలంగాణ నూతన గవర్నర్ ప్రత్యేక పూజలు 2/10

శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం కోసం గురువారం ఉదయం యాదగిరిగుట్టకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతోపాటు ఆయన కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

యాదగిరీశుడికి తెలంగాణ నూతన గవర్నర్ ప్రత్యేక పూజలు 3/10

గర్భాలయంలో స్వామి వారికి, అమ్మవార్లకు గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యాదగిరీశుడికి తెలంగాణ నూతన గవర్నర్ ప్రత్యేక పూజలు 4/10

అనంతరం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.

యాదగిరీశుడికి తెలంగాణ నూతన గవర్నర్ ప్రత్యేక పూజలు 5/10

ఆ తర్వాత వారికి ఆలయ ఈవో భవానీ శంకర్‌ స్వామివారి జ్ఞాపికతోపాటు ప్రసాదాన్ని అందజేశారు.

యాదగిరీశుడికి తెలంగాణ నూతన గవర్నర్ ప్రత్యేక పూజలు 6/10

గవర్నర్ యాదగిరిగుట్ట చేరుకోగానే.. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్, జిల్లా ఎస్పీ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.

యాదగిరీశుడికి తెలంగాణ నూతన గవర్నర్ ప్రత్యేక పూజలు 7/10

గవర్నర్ రాక సందర్భంగా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

యాదగిరీశుడికి తెలంగాణ నూతన గవర్నర్ ప్రత్యేక పూజలు 8/10

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

యాదగిరీశుడికి తెలంగాణ నూతన గవర్నర్ ప్రత్యేక పూజలు 9/10

హైదరాబాద్ లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌గా ప్రతాప్ శుక్లా చేత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే.

యాదగిరీశుడికి తెలంగాణ నూతన గవర్నర్ ప్రత్యేక పూజలు 10/10

సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులతోపాటు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated at - Mar 12 , 2026 | 04:50 PM