తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు: విపక్షాలకు సీఎం వార్నింగ్
ABN, Publish Date - Feb 08 , 2026 | 07:59 PM
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. రోజుకు ఒక జిల్లా చొప్పున ఆయన పర్యటిస్తున్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్‌లో ఏర్పాటు చేసిన 'ప్రజాపాలన - ప్రగతిబాట' బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
1/12
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు.
2/12
రోజుకు ఒక జిల్లా చొప్పున ఆయన పర్యటిస్తున్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్‌లో ఏర్పాటు చేసిన 'ప్రజాపాలన - ప్రగతిబాట' బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
3/12
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లా రద్దు చేస్తామంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. విపక్షాల కుట్రలు, కుతంత్రాలను నమ్మొద్దంటూ ప్రజలకు సూచించారు.
4/12
రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై సీఎం నిప్పులు చెరిగారు.
5/12
తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదంటూ ఆయా పార్టీల నేతలను హెచ్చరించారు. కొందరికి విషం చిమ్మడమే పనిగా మారిందంటూ విపక్షాలపై కారాలు మిరియాలు నూరారు.
6/12
కార్మికులకు నష్టం కలిగే ఏ పని చేయబోమన్నారు. తమ ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తుందన్నారు.
7/12
తెలంగాణలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్ల వ్యయం అవుతుందని గణాంకాలతో సహా సీఎం రేవంత్ వివరించారు.
8/12
ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
9/12
రూ.100 కోట్లతో మేడారం అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.
10/12
ఇటీవల ముగిసిన జాతరలో సమ్మక్క - సారలమ్మను 2 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
11/12
ఈ బహిరంగ సభకు భారీగా ప్రజలు పోటెత్తారు.
12/12
ఈ సమావేశానికి భారీగా ప్రజలు పోటెత్తడంతో.. సమీపంలోని మేడలపైకి ప్రజలు చేరుకుని.. ఈ సభను వీక్షించారు.
Updated at - Feb 08 , 2026 | 08:05 PM