పెట్రోల్ కోసం.. వాహనదారుల కష్టాలు
ABN, Publish Date - Mar 25 , 2026 | 09:38 AM
పెట్రోల్, డీజిల్ సరిపడనంత నిల్వలు లేవు. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్లుగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ సరఫరా చేయలేక పోతున్నాయి. దీంతో పలు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. పెట్రోలు నిల్వలు లేవనే విషయం తెలిసిన వాహనాదారులు.. ఆగమేఘాల మీద బంకులకు క్యూ కట్టారు.
1/11
పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర పోరు ప్రభావం ప్రపంచంపై పడింది. దీంతో గ్యాస్, చమురు కష్టాలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్ సమస్య వేధించింది.
2/11
గ్యాస్ సిలిండర్లు లేక చాలా హోటళ్లు మూతపడ్డాయి. గ్యాస్ సిలిండర్.. నిత్యవసర వస్తువుల్లో ఒకటి. సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీ క్యూలో జనం నిలబడుతున్నారు.
3/11
దేశంలో నేటికి పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొని ఉంది.
4/11
తాజాగా పెట్రోల్, డీజిల్ సరిపడనంతా నిల్వలు లేవు. ఈ నేపథ్యంలో పెట్రోలియం కంపెనీలు డిమాండ్‌కు తగ్గట్లుగా ఆయిల్ సరఫరా చేయలేక పోతున్నాయి. దీంతో పలు పెట్రోల్ బంకులు మూసివేశారు.
5/11
పెట్రోలు నిల్వలు లేవనే విషయం తెలిసిన వాహనాదారులు.. ఆగమేఘాల మీద బంకులకు పరుగులు పెడుతున్నారు.
6/11
దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి.
7/11
మరికొన్ని ప్రాంతాల్లో ముందస్తుగా నిల్వ ఉంచుకునేందుకు డ్రమ్ములు, క్యాన్‌లను పెట్రోల్ బంకులకు పట్టుకొస్తున్నారు.
8/11
హైదరాబాద్ నగర వ్యాప్తంగా వేలాది పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిలో దాదాపుగా సగం బంకులు మూతపడ్డాయి.
9/11
ఈ నేపథ్యంలో నగరంలో బంకుల ద్వారా పెట్రోల్ సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది.
10/11
కూకట్‌పల్లి పరిధిలో ఉదయం 4 గంటల నుంచి పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు క్యూ కట్టారు.
11/11
ఇదే పరిస్థితి కొనసాగితే.. నగరంలోని పెట్రోల్ బంకులన్నీ మూత పడతాయి. దాంతో వాహనాలను ఇంట్లో పెట్టి.. ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిందే.
Updated at - Mar 25 , 2026 | 10:40 AM