హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్ 3.0 భారీగా పాల్గొన్న నగరవాసులు
ABN, Publish Date - Sep 27 , 2026 | 11:24 AM
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పింక్ పవర్ రన్ 3.0 ఉత్సాహంగా జరిగింది. బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన, మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్ లక్ష్యంగా నిర్వహించిన ఈ రన్‌కు 35 వేల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
1/10
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో పింక్ పవర్ రన్ 3.0ను ఆదివారం (27-09-2026) ఉత్సాహంగా నిర్వహించారు.
2/10
మహిళల ఆరోగ్యం, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, ఫిట్‌నెస్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు.
3/10
ఈ రన్‌కు 35 వేల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకోగా, నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
4/10
3, 5, 10, 21 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించిన పరుగులు హెచ్ఎండీఏ గ్రౌండ్స్ నుంచి ప్రారంభమై నెక్లెస్ రోడ్ వరకు సాగింది.
5/10
ఆరోగ్యం, అవగాహన, మహిళా సాధికారత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
6/10
ఈ పింక్ పవర్ రన్‌కు మంత్రి సీతక్క, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్, బాక్సర్ విజేందర్ సింగ్, సంగీత దర్శకుడు ఎస్. ఎస్. థమన్, నటుడు సిద్దు జొన్నలగడ్డ తదితరులు హాజరయ్యారు.
7/10
ఎస్. ఎస్. థమన్ ప్రత్యక్ష సంగీత ప్రదర్శన ఈ కార్యక్రమంలో మరింత సందడి నెలకొంది.
8/10
2024లో గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో తొలి ఎడిషన్ నిర్వహించగా.. 2025లో నెక్లెస్ రోడ్డులో రెండో ఎడిషన్ జరిగింది.
9/10
ప్రతి ఏడాది పింక్ పవర్ రన్‌కు ఆదరణ పెరుగుతుండటంతో మూడో ఎడిషన్‌లోనూ భారీగా ప్రజలు పాల్గొన్నారు.
10/10
ఈ పింక్ పవర్ రన్ 3.0 సీజన్‌ను హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్, ప్రసాద్స్ ఐమాక్స్, సుధా రెడ్డి ఫౌండేషన్‌తోపాటు MEIL ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించాయి.
Updated at - Sep 27 , 2026 | 11:45 AM