గచ్చిబౌలిలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
ABN, Publish Date - Aug 22 , 2026 | 08:45 PM
హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. శిథిలాల కింద నుంచి వారి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు.
1/7
హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
2/7
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. శిథిలాల కింద నుంచి వారి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు.
3/7
నాలా పక్కనే 50 గజాల స్థలంలో నిర్మాణం చేపట్టిన ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
4/7
ఈ ఘటనలో మృతులు మధ్యప్రదేశ్‌కు చెందిన టైల్స్ కార్మికులు ఉమేశ్ కారే, మోపత్‌గా గుర్తించారు.
5/7
నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం ఈ మధ్యాహ్నం 1.00 గంట సమయంలో కూలిపోయింది.
6/7
శిథిలాలు పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడటంతో పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఆ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు వృద్ధులు గాయపడ్డారు.
7/7
ఈ ఘటన స్థలిని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన పరిశీలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Updated at - Aug 22 , 2026 | 09:00 PM