తిరుమలలో స్వర్ణరథోత్సవంపై శ్రీవారు.. పులకించిన భక్తులు
ABN, Publish Date - Sep 20 , 2026 | 07:36 PM
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం స్వామివారికి స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
1/8
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం స్వామివారికి స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
2/8
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
3/8
దీంతో ఆనందనిలయం పరిసర ప్రాంతాలు గోవిందా.. గోవిందా అంటూ శ్రీవారి నామస్మరణలతో మారుమోగాయి.
4/8
స్వర్ణకాంతులతో మెరిసిన రథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు.
5/8
ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు స్వామి వారు.. ఒక్కో వాహనంపై తిరువీధుల్లో విహరిస్తున్నారు.
6/8
సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తారు.
7/8
సెప్టెంబర్ 15న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు.. 23వ తేదీతో ముగుస్తాయి.
8/8
ఈ స్వర్ణరథోత్సవంలో టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, ప్రశాంతి రెడ్డి, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ, సినీనటుడు బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి పాల్గొన్నారు.
Updated at - Sep 20 , 2026 | 07:38 PM