తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం

ABN, Publish Date - Jan 25 , 2026 | 11:12 AM

సూర్య జయంతిని పురస్కరించుకొని నేడు(ఆదివారం) సప్త వాహనాలపై కోనేటి రాయుడు తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం 1/14

మాఘ మాసంలో వచ్చే గొప్ప పర్వదినం రథసప్తమి.. సూర్యని పుట్టినరోజు వేళ తిరుమల మాడ వీధుల్లో భక్తులకు శ్రీవారి దర్శనం

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం 2/14

సూర్యప్రభ వాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం 3/14

సూర్య జయంతిని పురస్కరించుకొని నేడు(ఆదివారం) సప్త వాహనాలపై కోనేటి రాయుడు తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం 4/14

ఈ ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో స్వామివారి వాహన సేవలు ప్రారంభమయ్యాయి. రాత్రి 8 గంటలకు జరిగే చంద్రప్రభ వాహనసేవతో పరిసమాప్తమవుతాయి.

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం 5/14

స్వామి వారి దర్శనం కోసం నిన్న సాయంత్రం నుంచే భక్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్నారు. టీటీడీ అధికారులు ఈ భక్తులకు అన్నప్రసాదం, పానీయాలు పంపిణీ చేస్తున్నారు.

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం 6/14

గ్యాలరీలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సూర్యోదయ సమయంలో సూర్యప్రభపై శ్రీవారిని దర్శించడం భక్తులకు అద్భుత అనుభూతిని కలిగించింది.

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం 7/14

తర్వాత చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హంస వాహనం, ఆశ్వ వాహనం, గజ వాహనం వంటి వాహనాలపై స్వామి వారు ఈ రోజు ఊరేగుతారు.

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం 8/14

రాత్రి 8:00 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో ఈ దివ్య వాహన సేవలు ముగుస్తాయి.

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం 9/14

ఈ రోజు సూర్య భగవానుడు తన రథంతో ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభించే రోజుగా పరిగణించబడుతుంది.

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం 10/14

తిరుమలలో శ్రీవారిని సూర్యప్రభ వాహనంపై దర్శించడం ద్వారా ఆరోగ్యం, సంపద, ప్రకాశం, పాప నివారణ వంటి ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం 11/14

టీటీడీ సిబ్బంది భక్తుల భద్రత, ఆరోగ్యం, అన్నప్రసాద వితరణ వంటి ఏర్పాట్లను పూర్తి చేసి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించారు.

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం 12/14

ఈ రోజును హిందూ సంప్రదాయంలో సూర్య భగవానుడి జన్మదినం (సూర్య జయంతి) గా జరుపుకుంటారు.

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం 13/14

పురాణాల ప్రకారం, సూర్యుడు అదితి దేవికి, కశ్యప మహర్షికి జన్మించిన రోజు ఇది.

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త(ఏడు)వాహనాలపై నేడు శ్రీవారి దివ్య దర్శనం 14/14

ఈ సందర్భంగానే సూర్యుడు తన రథాన్నెక్కి ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభించాడని, లోకాలకు వెలుగు, చైతన్యం పంచుతాడని నమ్మకం.

Updated at - Jan 25 , 2026 | 11:26 AM