ముగిసిన సరస్వతి అంత్య పుష్కరాలు..
ABN, Publish Date - Jun 01 , 2026 | 09:19 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పుర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి నది అంత్య పుష్కరాలు సోమవారం( జూన్1వ తేదీ)తో ముగిశాయి. చివరి రోజు కావడంతో ఈ పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు.
1/11
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పుర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి నది అంత్య పుష్కరాలు సోమవారం( జూన్1వ తేదీ)తో ముగిశాయి.
2/11
చివరి రోజు కావడంతో ఈ పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు.
3/11
ఈ పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రపంచ శాంతి కోసం వేదపండితులు యజ్ఞయాగాదులు, హోమాలు నిర్వహించారు.
4/11
ఈ పుష్కరాల్లో 8 మంది పీఠాధిపతులు సరస్వతి నదికి పూజలు నిర్వహించి.. పుష్కర స్నానాలు ఆచరించారు.
5/11
ఈ పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు.
6/11
కాళేశ్వరం దేవాలయంలో స్వామి వారికి కాశీ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
7/11
ప్రతి రోజు గోదావరి ఘాట్‌లో కాశీ పూజారులు నదికి హారతి ఇచ్చారు.
8/11
గోదావరిలో హంసవాహనం ఏర్పాటు చేసి.. స్వామివారిని ఊరేగించారు.
9/11
మే 21న ప్రారంభమైన ఈ పుష్కరాలు.. జూన్1వ తేదీతో.. అంటే నేటితో ముగిశాయి.
10/11
2025, మే 15 నుంచి మే 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు జరిగాయి. వీటిని ఆది పుష్కరాలు అని అంటారు.
11/11
మళ్లీ 12 ఏళ్లకు ఈ పుష్కరాలు రానున్నాయి.
Updated at - Jun 01 , 2026 | 09:21 PM