పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర

ABN, Publish Date - Sep 25 , 2026 | 09:17 PM

హైదరాబాద్ పాత బస్తీలో వినాయక నిమజ్జనం ఊరేగింపు భక్తిశ్రద్ధలతోపాటు ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను ప్రత్యేక వాహనాలపై ఊరేగింపుగా తీసుకువచ్చిన భక్తులు, డప్పులు, బ్యాండ్ మేళాలతో సందడి చేశారు.

పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర 1/14

హైదరాబాద్ పాత బస్తీలో వినాయక నిమజ్జనం ఊరేగింపు భక్తిశ్రద్ధలతోపాటు ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర 2/14

వివిధ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను ప్రత్యేక వాహనాలపై ఊరేగింపుగా తీసుకువచ్చిన భక్తులు, డప్పులు, బ్యాండ్ మేళాలతో సందడి చేశారు.

పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర 3/14

శోభాయాత్ర మార్గాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర 4/14

గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.

పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర 5/14

యువతి, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా ఈ యాత్రలో పాల్గొన్నారు.

పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర 6/14

పలుచోట్ల భక్తులకు మంచినీరు, ప్రసాదం ఏర్పాటు చేశారు.

పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర 7/14

వినాయకుడి నిమజ్జనం సందర్భంగా జరుగుతున్న శోభాయాత్ర కారణంగా పాతబస్తీ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది.

పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర 8/14

వయస్సుతో నిమిత్తం లేకుండా కులమతాలకు అతీతంగా ప్రజలంతా శోభాయాత్ర జరిగే రహదారికి చేరుకున్నారు.

పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర 9/14

ఇప్పటికే ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం గంగమ్మ ఒడి చేరింది.

పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర 10/14

బాలాపూర్‌లోని గణేష్‌ కూడా మరికాసేపట్లో గంగమ్మ ఒడి చేరనున్నారు.

పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర 11/14

నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర 12/14

గణేష్ శోభాయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎక్కడా అంతరాయం కలగకుండా పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించారు.

పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర 13/14

సీసీటీవీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బృందాలతో పరిస్థితిని ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

పాతబస్తీలో వైభవంగా వినాయక నిమజ్జనం శోభాయాత్ర 14/14

శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో డ్రోన్లతో పోలీసులు పహరా జరుపుతున్నారు.

Updated at - Sep 25 , 2026 | 09:48 PM