Medaram Jatara: మేడారం జాతర శోభ.. జంక్షన్లకు అద్భుత హంగులు

ABN, Publish Date - Jan 05 , 2026 | 03:16 PM

రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.7 కోట్లకు పైగా నిధులతో మేడారం జాతరకోసం అనేక సుందరీకరణ పనులు చేపట్టింది. ఇక్కడ ఉంచిన అద్భుత శిల్పాలు కేవలం అలంకరణ మాత్రమే కాదు, గిరిజన చరిత్ర, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించే సాక్ష్యాలుగా..

Medaram Jatara: మేడారం జాతర శోభ.. జంక్షన్లకు అద్భుత హంగులు 1/5

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా మేడారం జంక్షన్లకు కొత్త హంగులు..స్వాగత తోరణాలు, పాలరాతి శిల్పాలు.. గిరిజనుల జీవనశైలి, సంస్కృతి, సంప్రదాయాలను అద్దంలా ప్రతిబింబిస్తున్నాయి.

Medaram Jatara: మేడారం జాతర శోభ.. జంక్షన్లకు అద్భుత హంగులు 2/5

గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేస్తున్న శిల్పాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

Medaram Jatara: మేడారం జాతర శోభ.. జంక్షన్లకు అద్భుత హంగులు 3/5

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతరగా ప్రసిద్ధి చెందిన తెలంగాణలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఒక మహోన్నత ఘట్టం.

Medaram Jatara: మేడారం జాతర శోభ.. జంక్షన్లకు అద్భుత హంగులు 4/5

మేడారం చేరే మార్గాల్లోని ప్రధాన జంక్షన్లైన తాడ్వాయి, జంపన్నవాగు, పస్రా, ములుగు జంక్షన్లుకు సరికొత్త అందాలు అద్దుతున్నారు.

Medaram Jatara: మేడారం జాతర శోభ.. జంక్షన్లకు అద్భుత హంగులు 5/5

కోయ గిరిజనుల నృత్యాలు, వీరుల విల్లు-బాణాలు, కొమ్ము ఆకృతులు, వన్యప్రాణులు, అడవి సంపద, సమ్మక్క-సారలమ్మ చరిత్రను చిత్రీకరించే బొమ్మలు ఈ శిల్పాల్లో కనిపిస్తున్నాయి.

Updated at - Jan 05 , 2026 | 03:50 PM