ఇంద్రకీలాద్రిపై కార్తీక దీపోత్సవం..

ABN, Publish Date - Nov 25 , 2026 | 04:54 PM

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఇంద్రకీలాద్రిపరై కొలువుదీరిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో మంగళవారం ప్రదోషకాలంలో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా.. కన్నుల పండుగగా నిర్వహించారు.

 ఇంద్రకీలాద్రిపై కార్తీక దీపోత్సవం.. 1/8

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఇంద్రకీలాద్రిపరై కొలువుదీరిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో మంగళవారం ప్రదోషకాలంలో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా.. కన్నుల పండుగగా నిర్వహించారు.

 ఇంద్రకీలాద్రిపై కార్తీక దీపోత్సవం.. 2/8

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని దుర్గమ్మ దేవాలయ గాలి గోపురం ఎదుట దీపాలను ఈవోతోపాటు పాలక మండలి సభ్యులు వెలిగించారు.

 ఇంద్రకీలాద్రిపై కార్తీక దీపోత్సవం.. 3/8

మల్లేశ్వరస్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన దీపారాధన వేడుకలో భక్తులు సైతం పాల్గొన్నారు. దీంతో ఇంద్రకీలా దేదీప్యమానంగా ప్రకాశించింది.

 ఇంద్రకీలాద్రిపై కార్తీక దీపోత్సవం.. 4/8

కొండపై వెలిగిన దీపాలు వరుసలు, వాటి మధ్య నుంచి ప్రసరించిన దివ్య కాంతులు ఇంద్రకీలాద్రికి అపూర్వమైన ఆధ్యాత్మిక కళను తీసుకొచ్చాయి. ఎటు చూసినా దీపాల వెలుగులు, శివకేశవుల నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.

 ఇంద్రకీలాద్రిపై కార్తీక దీపోత్సవం.. 5/8

కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు.

 ఇంద్రకీలాద్రిపై కార్తీక దీపోత్సవం.. 6/8

దుర్గమ్మ సన్నిధిలో జ్వాలాతోరణాన్ని వెలిగించిన ఆలయ ఈవో శీనా నాయక్, పాలక మండలి చైర్మన్‌తోపాటు సభ్యులు.

 ఇంద్రకీలాద్రిపై కార్తీక దీపోత్సవం.. 7/8

కార్తీక పౌర్ణమి వేళ.. వెండి వెన్నెలను విరజిమ్ముతున్న చంద్రుడు. ఏడాదిలో 12 పౌర్ణమిలు వస్తే.. కార్తీక పౌర్ణమి రోజు మాత్రం చంద్రుడు మరింత ప్రకాశవంతంగా ఉంటాడు.

 ఇంద్రకీలాద్రిపై కార్తీక దీపోత్సవం.. 8/8

జ్వాలాతోరణం కింద నుంచి అమ్మవారి పల్లకిని తీసుకెళ్తున్న ఆలయ సిబ్బంది. ఈ కార్తీక పౌర్ణమికి దుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Updated at - Nov 25 , 2026 | 05:14 PM