తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ABN, Publish Date - Jan 01 , 2026 | 09:11 PM
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వారా దర్శనం కోసం వేలాదిగా తిరుమలకు సామాన్య భక్తులు చేరుకుంటున్నారు. రేపటి నుంచి సర్వదర్శనానికి టీటీడీ భక్తులను అనుమతించనున్నడంతో భారీగా తిరుమలకు చేరుకున్నారు భక్తులు.
1/7
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వారా దర్శనం కోసం వేలాదిగా తిరుమలకు సామాన్య భక్తులు చేరుకుంటున్నారు.
2/7
రేపటి నుంచి సర్వదర్శనానికి టీటీడీ భక్తులను అనుమతించనున్నడంతో భారీగా తిరుమలకు చేరుకున్నారు భక్తులు.
3/7
అవుటటర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి భక్తులను ప్రధాన క్యూ లైన్‌లోకి టీటీడీ అనుమతించింది.
4/7
వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వరుస సెలవులతోనే తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది.
5/7
టీటీడీ అధికారుల అంచనాలకు మించి తిరుమలకు భక్తులు చేరుకున్నారు. భక్తులను క్రమబద్ధంగా లోపలి క్యూ లైన్లలోకి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
6/7
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, ఆహారం, భద్రతా ఏర్పాట్లు పటిష్ఠం చేసినట్లు అధికారులు తెలిపారు.
7/7
క్యూ లైన్లలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, భక్తుల కదలికలు సజావుగా సాగేందుకు టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Updated at - Jan 01 , 2026 | 09:15 PM