సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Apr 02 , 2026 | 08:13 PM
తెలంగాణ అమరనాథ్‌గా పేరుగాంచిన సలేశ్వర క్షేత్రం భక్తులతో గురువారం కిక్కిరిసి పోయింది. చైత్ర పౌర్ణమి వేళ సలేశ్వరంలో మూడు రోజులపాటు జాతర బుధవారం ప్రారంభమైంది. మంగళవారం సాయంత్రం నుంచే భక్తుల రాక ప్రారంభమైంది.
1/20
తెలంగాణ అమరనాథ్‌గా పేరుగాంచిన సలేశ్వర క్షేత్రం భక్తులతో గురువారం కిక్కిరిసి పోయింది.
2/20
చైత్ర పౌర్ణమి వేళ సలేశ్వరంలో మూడు రోజులపాటు జాతర బుధవారం ప్రారంభమైంది. మంగళవారం సాయంత్రం నుంచే భక్తుల రాక ప్రారంభమైంది.
3/20
లోతట్టు అటవీ ప్రాంతంలోని పుల్లయపల్లి వరకు బస్సుల్లో చేరుకున్న భక్తులు.. అక్కడి నుంచి ఆటోల్లో రాంపూర్ వరకు తరలి వెళ్లారు. అక్కడి నుంచి నడక మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభించారు.
4/20
సలేశ్వరం వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.
5/20
సలేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ కారణంగా లింగమయ్య దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది.
6/20
ఏప్రిల్ 3వ తేదీ వరకు కొనసాగే ఈ జాతరకు సుమారు లక్షకు పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
7/20
నల్లమలలో దట్టమైన అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉండే ఇరుకైన లోయ. చెంచులు నిర్వహించే ఈ ఉత్సవాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలి వస్తారు.
8/20
ఇక్కడికి చేరుకోవడం కష్టసాధ్యమైనా.. వాటిని పట్టించుకోకుండా భక్తులు వస్తారు. ఇంతకీ సలేశ్వరం ఎలా వెళ్లాలంటే?
9/20
మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం ఫర్హాబాద్ నుంచి పుల్లయపల్లి, రాంపూర్, శ్రీశైలం మార్గంలో చెంచుపెంట మీదుగా 20 కిలోమీటర్లు వాహనంలో ప్రయాణించాలి.
10/20
హైదరాబాద్ నుంచి వెళ్లే వారు శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ మండలం మన్ననూరు నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణించాలి.
11/20
పర్హాబాద్ జంక్షన్ వద్ద అటవీశాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకుని అడవిలో అడుగు పెట్టాలి. వాహనంలో వెళ్లితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
12/20
సలేశ్వరానికి 4 కిలోమీటర్ల ముందు వాహనాలు నిలిపివేస్తారు. అక్కడి నుంచి కొండలు, గుట్టలు, రాళ్లు రప్పలు దాటుకుంటూ ముందుకు నడిచి వెళ్లితే ఆలయానికి చేరుకోవచ్చు.
13/20
కాలినడకన వెళ్లే వారు.. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం అంబగిరి, లింగాల మండలం అప్పాయిపల్లి మీదుగా 30 కిలోమీటర్లు ప్రయాణించాలి. అక్కడ తాగునీటి వసతి ఉంటుంది.
14/20
అక్కడ కాసేపు సేదతీరి మళ్లీ నడక ప్రారంభిస్తే అక్కడి నుంచి మరో 20 కిలోమీటర్ల దూరంలోని సలేశ్వరం చేరుకోవచ్చు.
15/20
అయితే చిన్నారులు, వృద్ధులు ఈ యాత్ర చేయడం కష్టంతో కూడి ఉంటుందని చెబుతారు.
16/20
సలేశ్వరాన్ని తొలుత శైలపురం అని పిలిచేవారు. కాలక్రమేణా అది సలేశ్వరంగా మారింది.
17/20
ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పౌర్ణమి నుంచి 3 రోజులు జాతర నిర్వహిస్తారు.
18/20
శుక్రవారంతో ఈ జాతర ముగుస్తుంది.
19/20
సలేశ్వరంలో పుణ్య స్నానాలు ఆచరించి.. గుహలో కొలువదీరిన లింగయమ్యను భక్తులు దర్శించుకుంటారు.
20/20
ఏడాదికి మూడు రోజులు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయంలో పూజలను చెంచు పూజారులు నిర్వహిస్తారు.
Updated at - Apr 02 , 2026 | 08:13 PM