అన్నవరంలో వైభవంగా సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణ.. తరలి వచ్చిన భక్తులు
ABN, Publish Date - Nov 24 , 2026 | 07:11 PM
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణ మహోత్సవం మంగళవారం వైభవంగా ప్రారంభమైంది.
1/7
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణ మహోత్సవం మంగళవారం వైభవంగా ప్రారంభమైంది.
2/7
స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొండ దిగువున తొలి పావంచాల వద్దకు తీసుకువచ్చారు.
3/7
తిరుచ్చిపై ఆసీనులను చేసి సుందరంగా అలంకరించారు. అనంతరం వైదిక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
4/7
ఆ తర్వాత గిరిప్రదక్షిణ మహోత్సవాన్ని దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో చక్రధర్ రావు, ఆర్‌జేసీ త్రినాథరావు తదితరులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
5/7
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. సత్యదేవుని నామస్మరణతో సత్యగిరులు మార్మోగాయి.
6/7
పిల్లా పాపలతో పలువురు తల్లిదండ్రులు ఈ గిరి ప్రదక్షణలో పాల్గొన్నారు.
7/7
ఈ గిరి ప్రదక్షణలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Updated at - Nov 24 , 2026 | 07:17 PM