ప్రకాశం జిల్లా పాకల బీచ్ ఫెస్టివల్.. రెండో రోజూ జనసందోహం..
ABN, Publish Date - Feb 16 , 2026 | 08:12 AM
ప్రకాశం జిల్లాలోని పాకల బీచ్లో రెండు రోజుల పాటు జరిగిన బీచ్ ఫెస్టివల్ రెండో రోజు కూడా అద్భుతంగా సాగింది. ఫిబ్రవరి 14న ఘనంగా ప్రారంభమైన ఈ ఫెస్టివల్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ, ఏపీ మారిటైమ్ బోర్డు, జిల్లా పరిపాలన సంయుక్తంగా నిర్వహించాయి.
1/9
ప్రకాశం జిల్లాలోని పాకల బీచ్ ఉత్సవానికి రెండో రోజు కూడా వేలాది మంది పర్యాటకులు, స్థానికులు తరలివచ్చారు. సముద్ర తీరం జనసంద్రంగా మారింది.
2/9
హెలికాప్టర్ రైడ్స్, పారా గ్లైడింగ్, స్పీడ్ బోట్ రైడ్స్, వాటర్ స్కూటర్స్, హాట్ ఎయిర్ బెలూన్స్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఆకట్టుకుంటున్నాయి.
3/9
ఆకాశం-సముద్రం కలిసే అద్భుత దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేశాయి.
4/9
సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ బ్యాండ్ ప్రదర్శనలు, డ్యాన్స్, మ్యూజిక్ షోలు రాత్రి వేళల్లో మరింత జోష్‌ను నింపాయి.
5/9
బీచ్ వాలీబాల్, కబడ్డీ, థ్రో బాల్, టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్ వంటి బీచ్ స్పోర్ట్స్ యువతలో ఉల్లాసాన్ని నింపాయి.
6/9
ఫుడ్ స్టాల్స్‌లో వివిధ రకాల సీఫుడ్, స్నాక్స్, ట్రడిషనల్ ఆంధ్ర వంటకాలు అందుబాటులో పెట్టారు. షాపింగ్ స్టాల్స్, ఎగ్జిబిషన్‌లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి.
7/9
మహాశివరాత్రి సందర్భంగా సాగర హారతి, వేద మంత్రోచ్చారణలతో పాటు సాంప్రదాయ కార్యక్రమాలు భక్తి భావాన్ని నింపాయి. సాయంత్రం ఫైర్‌వర్క్స్ డిస్‌ప్లేతో ఆకాశం అందంగా మెరిసింది.
8/9
మంత్రులు కందుల దుర్గేష్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్ రాజాబాబు, తదితరులు పాల్గొని ఈ ఫెస్టివల్‌ను ఘనంగా ప్రారంభించారు.
9/9
పాకల బీచ్ను టాప్-10 బీచ్‌లలో ఒకటిగా అభివృద్ధి చేసే దిశగా ఈ ఫెస్టివల్ ముఖ్యమైన అడుగు. ఫ్రీ ఎంట్రీతో అందరికీ అందుబాటులో ఉన్న ఈ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ పర్యాటకాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లింది.
Updated at - Feb 16 , 2026 | 08:15 AM