సింగపూర్‌లో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం..
ABN, Publish Date - Jun 14 , 2026 | 07:55 PM
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం ఆదివారం సింగపూర్ చేరుకుంది. విమానాశ్రయంలో ఆయనకు తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు.
1/8
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం ఆదివారం రాత్రి సింగపూర్ చేరుకుంది.
2/8
సింగపూర్ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుకు తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు.
3/8
తమతో పాటు తమ కుటుంబ సభ్యులతో వారంతా తరలి వచ్చి సీఎంకు స్వాగతం పలికారు.
4/8
అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలు దిగారు.
5/8
ఈ పర్యటన కోసం ఆదివారం (14-06-2026) మధ్యాహ్నం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లారు.
6/8
సోమవారం ఉదయం సింగపూర్‌లో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో సమావేశం కానున్నారు.
7/8
సింగపూర్‌లో పలువురు ప్రముఖులతో సీఎం చంద్రబాబు వరుసగా భేటీ అవుతారు.
8/8
మంగళవారం కూడా ఆయన బిజీ బిజీగా ఉండనున్నారు. అదే రోజు రాత్రి సింగపూర్ నుంచి భారత్‌కు తిరిగి ప్రయాణం కానున్నారు.
Updated at - Jun 14 , 2026 | 08:18 PM