అభివృద్ధి లేకుంటే సంపద లేదు.. సంపద లేకుంటే సంక్షేమం లేదు: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - May 07 , 2026 | 04:17 PM

ప్రజా సమస్యలను వంద శాతం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ఏడో విడత జిల్లా కలెక్టర్ల సదస్సులో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

అభివృద్ధి లేకుంటే సంపద లేదు.. సంపద లేకుంటే సంక్షేమం లేదు: సీఎం చంద్రబాబు 1/10

ప్రజా సమస్యలను వంద శాతం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ఏడో విడత జిల్లా కలెక్టర్ల సదస్సులో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

అభివృద్ధి లేకుంటే సంపద లేదు.. సంపద లేకుంటే సంక్షేమం లేదు: సీఎం చంద్రబాబు 2/10

అందరం సమష్టిగా పని చేయాలని.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పారు. సరిగా పరిపాలించకపోతే ప్రజలు ఆమోదించే అవకాశం లేదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇదే విషయం స్పష్టమైందని తెలిపారు.

అభివృద్ధి లేకుంటే సంపద లేదు.. సంపద లేకుంటే సంక్షేమం లేదు: సీఎం చంద్రబాబు 3/10

ప్రజా సంతృప్తే తనకు కొలమానం అని చెప్పారు. ప్రస్తుతం రూ.9.74 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంలో ఉందన్నారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను దారి మళ్లించిందని గుర్తు చేశారు.

అభివృద్ధి లేకుంటే సంపద లేదు.. సంపద లేకుంటే సంక్షేమం లేదు: సీఎం చంద్రబాబు 4/10

దీంతో కేంద్రం ఇచ్చే నిధులను ఆపేసిందని చెప్పారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని తెలిపారు.

అభివృద్ధి లేకుంటే సంపద లేదు.. సంపద లేకుంటే సంక్షేమం లేదు: సీఎం చంద్రబాబు 5/10

గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. అభివృద్ధి లేకుంటే సంపద లేదని.. సంపద లేకుంటే సంక్షేమం లేదని ఆయన స్పష్టం చేశారు.

అభివృద్ధి లేకుంటే సంపద లేదు.. సంపద లేకుంటే సంక్షేమం లేదు: సీఎం చంద్రబాబు 6/10

రాయల్ ఎన్‌ఫీల్డ్ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురాగలిగామన్నారు.

అభివృద్ధి లేకుంటే సంపద లేదు.. సంపద లేకుంటే సంక్షేమం లేదు: సీఎం చంద్రబాబు 7/10

పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు తీసుకొచ్చామని వివరించారు. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారిందన్నారు.

అభివృద్ధి లేకుంటే సంపద లేదు.. సంపద లేకుంటే సంక్షేమం లేదు: సీఎం చంద్రబాబు 8/10

దేశంలోని అతిపెద్ద కంపెనీలన్నీ ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయని పేర్కొన్నారు.

అభివృద్ధి లేకుంటే సంపద లేదు.. సంపద లేకుంటే సంక్షేమం లేదు: సీఎం చంద్రబాబు 9/10

వారానికో కంపెనీ తీసుకొస్తున్నాం.. రోజుకో శంకుస్థాపన చేస్తున్నామన్నారు.

అభివృద్ధి లేకుంటే సంపద లేదు.. సంపద లేకుంటే సంక్షేమం లేదు: సీఎం చంద్రబాబు 10/10

ప్రజల కోసం పని చేసే వ్యక్తులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు.

Updated at - May 07 , 2026 | 04:19 PM