తిరుపతిలో ఎన్డీయే కూటమి విజయోత్సవ సభ..
ABN, Publish Date - Jun 12 , 2026 | 09:24 PM
2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ప్రజలను కోరామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తైన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలోని దామినేడులో శుక్రవారం బహిరంగ సభ నిర్వహించారు.
1/18
2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ప్రజలను కోరామని చెప్పారు.
2/18
కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తైన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలోని దామినేడులో శుక్రవారం బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
3/18
ఈ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. 2024లో 57 శాతం ఓట్ షేర్.. 94 శాతం స్ట్రయిక్ రేట్ సాధించామని పేర్కొన్నారు. 2024లో రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకున్నారని వివరించారు.
4/18
తన రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే మొదలైందని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ కల్యాణ్ అని చంద్రబాబు అన్నారు.
5/18
వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్ అరాచక పాలన ప్రారంభమైందన్నారు.
6/18
కేంద్ర పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను పక్కన పడేశారని మండిపడ్డారు. అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు.
7/18
ఆర్థిక ఇబ్బందులున్నా.. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎక్కడా లేనివిధంగా ఏపీలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.
8/18
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు.
9/18
63 లక్షల మందికి NTR భరోసా పెన్షన్లు అందజేశామని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్లు తెలిపారు.
10/18
అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందజేస్తున్నామన్నారు. P4 ప్రయోగంతో ఆర్థిక అసమానతలను తగ్గించామన్నారు.
11/18
21వ శతాబ్దం ప్రధాని మోదీదే అని సీఎం స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో దేశానికి మోదీ ఆత్మస్థైర్యం ఇచ్చారన్నారు.
12/18
2047 నాటికి భారత్ ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ పాలనలో భారత్ ప్రతిష్ఠ పెరిగిందని వెల్లడించారు.
13/18
పుట్టపర్తిలో ఐదో తరం ఫైటర్‌జెట్ తయారుకాబోతోందన్నారు.
14/18
తిరుపతిలో బుల్లెట్ ఫ్యాక్టరీ వస్తోందని, రాయలసీమ ఇప్పుడు బంగారుసీమ కాబోతోందన్నారు.
15/18
వచ్చే నెలలో రాయలసీమ స్టీల్ ప్లాంట్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.
16/18
జొన్నవాడలో బంగారం వెలికితీస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్ పవర్‌పై దృష్టి సారించినట్లు చెప్పారు.
17/18
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తయారుచేస్తున్నామని తెలిపారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమ ముఖచిత్రాన్ని కాపాడతామన్నారు. కల్యాణి డ్యామ్‌కు ఈ ఏడాది నీళ్లు తీసుకొస్తున్నామన్నారు.
18/18
3 రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడారని మండిపడ్డారు. ‘3 రాజధానులు కాదు.. 3 ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం’ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
Updated at - Jun 12 , 2026 | 09:50 PM