AP Dwakra Mela 2026: గుంటూరులో సరస్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ABN, Publish Date - Jan 08 , 2026 | 09:37 PM

ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే డ్వాక్రా పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తన మాట విన్న కుటుంబాలు ఇప్పుడు బాగుపడ్డాయని సంతోషం వ్యక్తం చేశారు. అధిక తలసరి ఆదాయం పొందేది మన తెలుగువారి కుటుంబాలేనని స్పష్టం చేశారు.

AP Dwakra Mela 2026: గుంటూరులో సరస్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 1/10

డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

AP Dwakra Mela 2026: గుంటూరులో సరస్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 2/10

గుంటూరు నగర శివారులో ఈ రోజు సరస్ మేళా 2026.. అఖిల భారత డ్వాక్రా బజారును సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

AP Dwakra Mela 2026: గుంటూరులో సరస్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 3/10

సొంత కాళ్లపై ఆడబిడ్డలు నిలబడాలనే ఉద్దేశ్యంతోనే డ్వాక్రా స్థాపించినట్లు చంద్రబాబు తెలిపారు.

AP Dwakra Mela 2026: గుంటూరులో సరస్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 4/10

టీడీపీకి మహిళలతో ప్రత్యేక అనుబంధం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వారి కష్టాలు చూసే దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని వివరించారు.

AP Dwakra Mela 2026: గుంటూరులో సరస్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 5/10

సంజీవని పథకంతో ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చామని చంద్రబాబు వివరించారు.

AP Dwakra Mela 2026: గుంటూరులో సరస్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 6/10

ఇక ఆన్‌లైన్‌లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

AP Dwakra Mela 2026: గుంటూరులో సరస్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 7/10

పొదుపు సంఘాలు రూ. 26 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశాయని.. 1.13 కోట్ల మంది సభ్యులు ఉన్నారన్నారని.. రూ. 5,200 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

AP Dwakra Mela 2026: గుంటూరులో సరస్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 8/10

దేశంలోని బెస్ట్ ప్రాక్టీసెస్‌ను ఏపీకి తీసుకురావాలన్నారు చంద్రబాబు.. మహిళల శక్తి తనకు తెలుసునని చంద్రబాబు చెప్పారు.

AP Dwakra Mela 2026: గుంటూరులో సరస్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 9/10

మన రాష్ట్రంలోని మహిళలు.. ఉత్తర భారతదేశంలోని మహిళలకు శిక్షణ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు.

AP Dwakra Mela 2026: గుంటూరులో సరస్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 10/10

మహిళా సంఘాలను సమర్థవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated at - Jan 08 , 2026 | 09:37 PM