Share News

సెయింట్‌లూయిస్‌లో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 10:14 PM

అమెరికాలోని సెయింట్ లూయిస్ నగర ఎన్నారై టీడీపీ విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

సెయింట్‌లూయిస్‌లో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
Chandrababu Naidu birthday Celebrations St Louis

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని సెయింట్ లూయిస్ నగర ఎన్నారై టీడీపీ విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం రక్తదాన శిబిరంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు పార్టీ తరపున ప్రశంసాపత్రాలు అందజేశారు. కూటమి కార్యకర్తల కోలాహలం మధ్య జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ప్రవాసాంధ్రులు చంద్రబాబు జన్మదినాన్ని తమ ఇంటి పండుగలా జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో ఎన్నారై టీడీపీ సభ్యులు చెంచు వేణుగోపాల్ రెడ్డి (అధికార ప్రతినిధి), ఎన్నారై తెదేపా ప్రాంతీయ ప్రతినిధి రాజా సూరపనేని, సురేన్ పాతూరి, కిషోర్ ఎర్రపోతిన, రవి పొట్లా, సుధాకర్ నర్రా, వంశీ పాతూరి, వీరా, నాగకుమార్ బెల్లంకొండ, వెంకట్ గౌని, మురళి పుట్టగంటి, పల్లవి సూరపనేని, శ్రీకాంత్ సూరపనేని, తాళ్లూరి లకుమ, పిడికిటి రాధ, జనసేన నాయకులు విజయ్ సాక్షి, సత్య తదితరులు పాల్గొన్నారు.

2.jpg


టీడీపీ నేతలు పల్లా శ్రీనివాసరావు, రఘురామరాజు, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తమ సందేశాలను పంపించారు. సీఎం చంద్రబాబునాయుడు సారథ్యంలో చేపడుతున్న రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు, అమరావతి నిర్మాణానికి ప్రవాసుల తరఫున పూర్తి మద్దతు ఉంటుందని కూటమి సభ్యులు ఈ సందర్భంగా ప్రకటించారు.

3.jpg

Updated Date - Apr 25 , 2026 | 10:41 PM