Share News

తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో సీపీఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్

ABN , Publish Date - Feb 09 , 2026 | 08:42 PM

తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో సీపీఆర్ అండ్ ఏఈడీ ప్రోగ్రామ్ విజయవంతంగా జరిగింది.

తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో సీపీఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
TANA NY CPR and AED Training Program

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో శనివారం, ఫిబ్రవరి 7న న్యూయార్క్‌లోని అసమై హిందూ టెంపుల్‌లో నిర్వహించిన సీపీఆర్, ఏఈడీ (CPR & AED) సర్టిఫికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విజయవంతంగా జరిగింది. సమాజానికి ప్రాణాలను రక్షించే అత్యవసర నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు కుటుంబాల నుండి విశేష స్పందన లభించింది.

ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మొత్తం 30 మందికి ప్రామాణిక శిక్షణ అందించబడింది. అత్యవసర పరిస్థితుల్లో సమయోచితంగా స్పందించి ప్రాణాలను రక్షించగలిగే ఈ శిక్షణ సమాజానికి ఎంతో ఉపయోగకరమైంది. ఇందులో పాల్గొన్న వారికి పరీక్ష నిర్వహించి, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) నుండి 2 సంవత్సరాల సర్టిఫికేషన్‌ను నిర్వాహకులు ఇచ్చారు.

TANA అధ్యక్షులు నరేన్ కొడాలి ప్రేరణాత్మక నాయకత్వంలో, TANA హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్ మాధురి యెలూరి పర్యవేక్షణలో, TANA ట్రెజరర్ రాజా కసుకుర్తి సహాయ సహకారాలతో, TANA న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు సమర్థవంతమైన సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది.

TANA 8.jpg


ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లుగా ప్రసాద్ కోయి, సుచరిత అనంతనేని, రజిత కల్లూరి, జితేంద్ర యార్లగడ్డ, దిలీప్ ముసునూరు, శ్రీనివాస్ నాదెళ్ళ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములయ్యారు. TANA న్యూయార్క్ టీమ్ సభ్యులుగా రాజేశ్ కడియాల, కలీమ్ మహమ్మద్, ప్రదీప్ అరవేటి గార్లు తమ అమూల్యమైన సేవలను అందించారు.

కార్యక్రమం విజయవంతమయ్యేందుకు కీలకంగా నిలిచిన యువ వాలంటీర్లు ఆశ్రిత కోయి, శరణ్ సాయి భర్తవరపు, గీతిక చల్లా, విష్ణు సాయి ఆశ్రిత్ రాచకుంట, సుధీక్ష ముసునూరు, సుహాస్ ముసునూరు, సమన్విత మిన్నెకంటికి TANA న్యూయార్క్ టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఈ సీపీఆర్ అండ్ ఏఈడీ ట్రైనింగ్ కార్యక్రమానికి ముఖ్య సహకారం అందించిన Xavier University School of Medicine యాజమాన్యానికి TANA న్యూయార్క్ టీమ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

ఈ కార్యక్రమానికి న్యూయార్క్‌లోని స్థానిక సంస్థలైన టీఎల్‌సీఏ అధ్యక్షులు శ్రీ సుమంత్ రామశెట్టి, ఎన్‌వైటీటీఏ అధ్యక్షులు రవీంద్ర కోడెల హాజరై, తానా న్యూయార్క్ టీమ్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ సేవా కార్యక్రమాలను అభినందించారు. ముఖ్యంగా సీపీఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సమాజానికి ఎంతో ఉపయోగకరమైందని పేర్కొంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ భర్తవరపు గారు మాట్లాడుతూ, ‘సమాజ సేవే లక్ష్యం’ అనే నినాదంతో తానా న్యూయార్క్ టీమ్ భవిష్యత్తులో కూడా మరిన్ని సార్థకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి అండగా నిలుస్తుందని తెలిపారు.

TANA 7.jpg

Updated Date - Feb 10 , 2026 | 07:11 AM