Share News

హాంకాంగ్‌లో వైభవంగా కార్గిల్ విజయ్ దివస్

ABN , Publish Date - Aug 10 , 2026 | 05:17 PM

‘సురభి ఏక్ ఎహసాస్’ 10వ వార్షికోత్సవం సందర్భంగా, హాంగ్‌కాంగ్‌లో 27వ కార్గిల్ విజయ్ దివస్‌ను తెలుగు గ్లోబల్ వెబ్ రేడియో అయిన తెలుగువన్ రేడియో ఆన్ ఇంటర్నెట్‌కు (టోరీ) చెందిన రేడియో జాకీ జయ పీసపాటి ఘనంగా నిర్వహించారు.

హాంకాంగ్‌లో వైభవంగా కార్గిల్ విజయ్ దివస్
Kargil Diwas in Hongkong

‘సురభి ఏక్ ఎహసాస్’ 10వ వార్షికోత్సవం సందర్భంగా, హాంగ్‌కాంగ్‌లో తెలుగువన్ రేడియో ఆన్ ఇంటర్నెట్‌‌లో (టోరీ) రేడియో జాకీ జయ పీసపాటి 27వ కార్గిల్ విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఆమె 2012 నుంచి భారత సాయుధ దళాలకు అంకితం చేస్తూ ‘జై హింద్’ అనే టాక్ షోను నిర్వహిస్తున్నారు. ఈ షోలో కార్గిల్ యుద్ధ వీరులు, వీరనారీమణులు, సాయుధ దళాల కుటుంబాలకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థలు (NGOలు) పాల్గొంటున్నాయి.

ఈ సంవత్సరం కూడా హాంగ్‌కాంగ్‌లోని ప్రవాస భారతీయులు దేశ భక్తి, అభిమానంతో దేశ రక్షకులైన సైనికుల కోసం ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లతో సహా పిల్లలు, పెద్దలు అందరూ అదే ఉత్సాహంతో, స్ఫూర్తితో దేశభక్తి ఉప్పొంగేలా గీతాలు పాటలు, నృత్యాలను ప్రదర్శించారు.

గతనెల 26న జరగాల్సిన ఈ కార్యక్రమం, ఊహించని విధంగా కేటగిరీ 8 (T8) తుఫాను రావడంతో ఆగస్టుకు వాయిదా పడింది. భారత-నేపాలీ యుద్ధ స్మారక చిహ్నానికి ఆనుకొని ఉన్న హ్యాపీ వ్యాలీలోని హిందూ దేవాలయంలోని మోహన్ హాల్‌లో భారత కాన్సులేట్ జనరల్, హిందూ సంఘం వారి గొప్ప సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.

7.jpg


ఈ కార్యక్రమానికి హాంకాంగ్, మకావులలోని భారత గౌరవనీయ కాన్సుల్ జనరల్ రాజేష్ ఎన్ నాయక్‌తో పాటు కాన్సుల్స్ మిస్ సుర్భి గోయల్, కాన్సుల్ కె. వెంకట్ రమణ శ్రీ మేఘనాథ్ మధుకర్ గావిత్, హిందూ సంఘం అధ్యక్షుడు లాల్ హర్దాసాని, హాంకాంగ్, చైనాలోని భారతీయ జనతా పార్టీ (బీజీపీ) ఓవర్సీస్ ప్రెసిడెంట్ సోహన్ గోయెంకా, హిందూ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షుడు నిర్మల్ లాంగని, పూజ్ బ్రహ్మ సమాజ్ హాంకాంగ్ అధ్యక్షురాలు నీనా పుష్కర్ణ, ఇతర ప్రవాస భారతీయులు హాజరయ్యారు.

గౌరవ కాన్సుల్ జనరల్ రాజేష్ ఎన్ నాయక్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సైనికుల త్యాగాలను, భారత త్రివిధ దళాల విశేష సేవలను ప్రముఖంగా ప్రస్తావించారు. సురభి ఎక్ ఎహసాస్ నిర్వాహకుల స్ఫూర్తిని ప్రశంసించారు. హ్యాపీ వ్యాలీలోని హిందూ దేవాలయం వెనుక ఉన్న ఇండియన్ సోల్జర్స్ వార్ మెమోరియల్, హిందూ/ సిక్కు స్మశానవాటికలు హాంకాంగ్‌లో భారత్, నేపాలీ సైనికులను గౌరవించే ప్రధాన ప్రదేశాలని హిందూ అసోసియేషన్ అధ్యక్షుడు లాల్ హర్దాసాని పేర్కొన్నారు.

ఈ స్థలంలో ధార్మిక సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిగిన ఎనిమిది మంది ప్రథమ ప్రపంచ యుద్ధ సైనికుల పేర్లు శిలాఫలకంపై ఉన్నాయి. ప్రతి సంవత్సరం భారత కాన్సులేట్ జనరల్, హాంగ్‌కాంగ్, స్థానిక ప్రవాస భారతీయ సంఘాలు నిర్వహించే స్మరణోత్సవాలకు ఇది కేంద్ర బిందువుగా నిలుస్తోంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ నిధులతో, హిందూ అసోసియేషన్ హాంగ్‌కాంగ్ సమన్వయంతో ఈ స్థలానికి ప్రధాన సంరక్షణ, నిర్మాణ పునరుద్ధరణలు చేశారని తెలిపారు.

3.jpg


కార్గిల్ యుద్ధ వీరుడు, సేనా పతక గ్రహీత అయిన కెప్టెన్ నవీన్ నాగప్ప హాంకాంగ్‌లోని ప్రవాస భారతీయులకు పంపిన వీడియో సందేశం ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యుద్ధరంగలో తన అనుభవాల గురించి, పరమ వీర చక్ర గ్రహీత అయిన కెప్టెన్ విక్రమ్ బాత్రా శౌర్యం, మహోన్నత త్యాగం గురించి ఆయన వినయంగా ప్రస్తావించారు.

ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవం గురించి కూడా సమావేశంలో సగర్వంగా పేర్కొన్నారు. గౌరవనీయ కాన్సుల్ జనరల్ రాజేష్ ఎన్. నాయక్, తోటి కాన్సుల్స్, హిందూ అసోసియేషన్ అధ్యక్షుడు లాల్ హర్దాసాని రేడియో జాకీ జయ పీసపాటి తదితరులు.. భారతదేశ వారసత్వం పట్ల గర్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ, సుందరమైన చేనేత వస్త్రాల్లో కనిపించారు.

సాంస్కృతిక ప్రదర్శనలిచ్చిన వారందరికీ రాజేష్ ఎన్ నాయక్ ప్రశంసా చిహ్నాన్ని ప్రదానం చేశారు.'ఐక్యతా మంత్రాలైన జై హింద్, వందేమాతరం నినాదాలతో సభామందిరం పలుమార్లు మారుమోగింది. అందరు మరల వచ్చే ఏడాది మళ్లీ కలుస్తామని వాగ్దానం చేశారు. హాంకాంగ్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్ 'బాంబే డ్రీమ్స్' అందించిన అల్పాహారాన్ని అందరూ స్వీకరించారు. హాంకాంగ్ తెలుగు సమఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు, రేడియో జాకీ జయ పీసపాటి వందన సమర్పణ చేశారు.

5.jpg8.jpg4.jpg2.jpg1.jpg


ఈ వార్తలనూ చదవండి:

గల్ఫ్‌లో తెలంగాణ జనసేన కార్యవర్గం ఏర్పాటుకు సన్నాహాలు

అమెరికాలో ఓ వివాహ వేడుకకు హాజరైన మంత్రి నారా లోకేష్

Updated Date - Aug 10 , 2026 | 05:39 PM