కొల్లా సాకేత్ ఫౌండేషన్‌కు రూ.15 లక్షల విరాళం
ABN , Publish Date - Aug 16 , 2026 | 03:19 PM
బీటా థలస్సీమియా మేజర్‌తో పోరాడిన సాకేత్ కొల్లా స్మారకార్థం ఏర్పాటు చేసిన సాకేత్ ఫౌండేషన్ సారథ్యంలో 15వ వార్షిక 5కే వాక్ శనివారం ఫ్రిస్కో కామన్స్ పార్కులో జరిగింది.
బీటా థలస్సీమియా మేజర్‌తో పోరాడిన సాకేత్ కొల్లా స్మారకార్థం ఏర్పాటు చేసిన సాకేత్ ఫౌండేషన్ సారథ్యంలో 15వ వార్షిక 5కే వాక్ శనివారం ఫ్రిస్కో కామన్స్ పార్కులో జరిగింది. ప్రవాసులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విరాళాలు అందజేశారు. ఈ వాక్ ద్వారా ₹15లక్షలు($16వేల డాలర్లు) అందాయని సాకేత్ తల్లిదండ్రులు శ్రీనివాస్, లక్ష్మి తెలిపారు. సాకేత్ స్ఫూర్తిని స్మరించుకుంటూ, భారతదేశంలోని ఆర్థికంగా వెనుకబడిన పిల్లల ఆరోగ్యం, విద్య కోసం ఈ నిధులను ఖర్చు చేస్తామని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు: www.sakethfoundation.org చూడవచ్చు.