Share News

ఖతర్‌లో తెలుగు కళా సమితి వనభోజనం

ABN , Publish Date - Nov 25 , 2026 | 07:46 PM

పాత కొత్తల మేలు కలయికగా విభిన్న వర్గాలకు చెందిన తెలుగు ప్రవాసీయులు ఇటీవల ఖతర్‌లో కార్తీక వనభోజనాలను నిర్వహించారు.

ఖతర్‌లో తెలుగు కళా సమితి వనభోజనం
Qatar Telugu Kala Samithi - Karthika Vanabhojanam

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: పాత కొత్తల మేలు కలయికగా విభిన్న వర్గాలకు చెందిన తెలుగు ప్రవాసీయులు ఇటీవల ఖతర్‌లో కార్తీక వనభోజనాలను నిర్వహించారు.

ఖతర్‌లోని తెలుగు కళా సమితి (టి.కె.యస్) ఆధ్వర్యంలో కనువిందుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక, ఆత్మీయత వెల్లివిరిసింది. ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ సంఘాలన్నింటిలోనూ ప్రప్రథమంగా ఏర్పాటైన టి.కె.యస్ కాలక్రమేణా గత ఘన వైభవాన్ని కోల్పోయినా.. పాత చుట్టం - పాత చింతకాయ పచ్చడిలాగా ఇప్పటికీ తనకంటూ ఒక ఖ్యాతిని కల్గి ఉంది.

2.jpg


తెలుగు సంప్రదాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే టి.కె.యస్ తెలుగు కుటుంబాలు భక్తితో దీపాల వెలుగులు, హరిహరుల నామస్మరణలతో పాటించే కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలను కూడా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన వనభోజనాలలో పెద్ద సంఖ్యలో కుటుంబాలు పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా టి.కె.యస్ అధ్యక్షుడు అధ్యక్షులు మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ (సత్య) మాట్లాడుతూ ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ తెలుగు వాళ్ళు తమ మాతృభూమి, దాని సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలని కోరారు. కులమతాలకు అతీతంగా తెలుగువారందర్నీ ఒక వేదికపై తీసుకురావడానికి తమ సంఘం ప్రయత్నిస్తుందని సత్య పేర్కొన్నారు.

3.jpg


కార్యక్రమంలో శాంతను పాండే (ఇండియన్ కల్చరల్ సెంటర్), వెంకప్ప భాగవతుల, (ఐ.సి.సి), ప్రవీణ లక్ష్మి (తెలంగాణ జాగృతి), రమణ (ఆంధ్ర కళా వేదిక), శాంతయ్య (టి.డి.యఫ్), విజయ (డైసో) తదితరులు పాల్గొన్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమ నిర్వహణలో తెలుగు కళా సమితి ప్రతినిధులు అనుమళ్ల సత్యనారాయణ, సాహిత్య జ్యోత్స్న, హేమ సత్యరేఖ, నరేష్, ఉమాశంకర్ సహకరించగా వివిధ కార్యక్రమాలను స్వప్న, రోజా, వాసవి, రాజు, గౌరీ, దినేష్‌లు సమన్వయం చేసారని నిర్వాహకులు తెలిపారు.

4.jpg


5.jpg6.jpg7.jpg

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో ఒక్కచోట చేరిన విశాఖవాసులు.. అట్లాంటాలో ఘనంగా ‘మీట్ అండ్ గ్రీట్’

THKTS ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

Updated Date - Nov 25 , 2026 | 08:12 PM