Share News

వీసా ఫ్రాడ్ కేసు.. దోషులుగా ఇద్దరు భారతీయులు

ABN , Publish Date - Apr 19 , 2026 | 10:42 PM

యూఎస్ వీసా ఫ్రాడ్ కేసులో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దోషులుగా తేలారు. తాము చేసిన నేరాన్ని వారు అంగీకరించారని కాలిఫోర్నియా అటార్నీ కార్యాలయం పేర్కొంది.

వీసా ఫ్రాడ్ కేసు.. దోషులుగా ఇద్దరు భారతీయులు
H1B visa fraud case

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో వీసా మోసాలకు పాల్పడిన కేసులో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దోషులుగా తేలారు. లేని ఉద్యోగాలు ఉన్నట్టు చూపించి వారు మోసాలకు తెగబడినట్టు బయటపడింది. ఈ కేసులో తాము హెచ్-1బీ వీసా దుర్వినియోగానికి పాల్పడినట్టు దోషులు అంగీకరించారని కాలిఫోర్నియాలోని అమెరికా అటార్నీ కార్యాలయం తెలిపింది.

మీడియా కథనాల ప్రకారం, భారత సంతతికి చెందిన సంపత్ రాజది డబ్లిన్‌లో రెండు వీసా సేవల కేంద్రాలను నిర్వహిస్తున్నారు. మరో నిందితుడైన శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్‌లో సమాచార అధికారిగా ఉండేవారు.


అయితే, నిందితులిద్దరూ జూన్ 2020-2023 జనవరి మధ్యలో పలువురు ఉద్యోగార్థుల పేరు మీద వీసా పిటిషన్లు దాఖలు చేశారు. దరఖాస్తులకు ఆమోదం లభించాక వాటిని ఇతరులకు కుట్రపూరితంగా ఇచ్చినట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. చివరకు నిందితులు కూడా తాము చేసిన నేరాన్ని అంగీకరించారని అటార్నీ కార్యాలయం తెలిపింది. ఈ కేసులో నిందితులకు గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష, 2.50 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - Apr 25 , 2026 | 10:41 PM