Share News

అతడు కంట్రోల్ తప్పిపోయాడు.. ఆస్ట్రేలియాలో ఎన్నారైకి 13 ఏళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - May 17 , 2026 | 01:54 PM

ఆస్ట్రేలియాలో 61 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఒక భారత సంతతి వ్యక్తికి స్థానిక కోర్టు 13 ఏళ్ల 10 నెలల కారాగార శిక్ష విధించింది.

అతడు కంట్రోల్ తప్పిపోయాడు.. ఆస్ట్రేలియాలో ఎన్నారైకి 13 ఏళ్ల జైలు శిక్ష
Indian origin therapist in Australia Jailed

ఇంటర్నెట్ డెస్క్: లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఒక భారత సంతతి మసాజ్ థెరపిస్టుకు ఆస్ట్రేలియాలో 13 ఏళ్ల 10 నెలల కారాగార శిక్ష పడింది. అడిలైడ్‌లోని ఒక మసాజ్ పార్లర్‌లో 61 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో సుమిత్ సతీశ్ రస్తోగీని (39) కోర్టు దోషిగా తేల్చింది. మహిళలను కెమెరాతో రహస్యంగా చిత్రీకరించడం, అసభ్యంగా తాకడం వంటి నేరాలకు పాల్పడ్డాడని కోర్టు పేర్కొంది. అతడు పూర్తిగా అదుపు తప్పి ప్రవర్తించాడని న్యాయమూర్తి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.


స్థానిక మీడియా కథనాల ప్రకారం, 2021 అక్టోబర్ - 2022 జులై మధ్య కాలంలో అతడు ఈ దారుణాలకు పాల్పడ్డాడు. మసాజ్ కోసమని వచ్చిన మహిళలతో అనుచితంగా ప్రవర్తించాడు. అతడిపై నమ్మకంతో వచ్చినవారిపై నిందితుడు లైంగిక వేధింపులకు దిగాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. క్రమక్రమంగా అతడు పూర్తిగా అదుపు తప్పి రెచ్చిపోయాడని కూడా వ్యాఖ్యానించారు. ఎలాంటి అర్హతలు లేకున్నా అతడు మసాజ్ థెరపిస్టుగా పనిచేశాడని కూడా న్యాయవార్తి పేర్కొన్నారు.

నిందితుడి చర్యల కారణంగా బాధితులు తీవ్ర మానసిక వేదన అనుభవించారని అన్నారు. అతడికి 13 ఏళ్ల 10 నెలల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఢిల్లీకి చెందిన రస్తోగీ 2011లో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. శిక్షాకాలం పూర్తయ్యాక అతడిని స్వదేశానికి తిరిగి పంపించే అవకాశం ఉందని కూడా అధికారులు కోర్టుకు తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

జపాన్‌‌లో భారతీయ రెస్టారెంట్ మూసివేత.. యజమాని కన్నీరుమున్నీరు

యూఎస్ఏ‌లో గ్రేట్ ఇండియన్ ఫుడ్, షాపింగ్ ఫెస్ట్ అండ్ మ్యాంగో ఫెస్టివల్

Updated Date - May 17 , 2026 | 02:03 PM