Share News

దుబాయిలో తెలుగు సీఏల వనభోజన ఉత్సవం

ABN , Publish Date - Nov 23 , 2026 | 01:20 PM

దుబాయిలోని తెలుగు సీఏలు కార్తిక మాస వనభోజనాల్లో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

దుబాయిలో తెలుగు సీఏల వనభోజన ఉత్సవం
Karthika Vanabhojanam in Dubai

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: మహాభారతంలో నారద మహర్షి కాలం మొదలు నేటి వరకూ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను నిరంతరం పర్యవేక్షిస్తూ కచ్చితమైన ప్రశ్నలడిగే చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర విలక్షణమైనది. సరళీకృత దుబాయి మహానగర ఆర్థిక వ్యవస్థలో తెలుగు ప్రవాసీ చార్టర్డ్ అకౌంటెంట్లు తమకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నారు. నిరంతరం లెక్కల్లో మునిగి తేలే వీరు ఆదివారం మొక్కల మధ్య చెట్ల కింద ఉల్లాసంగా గడిపేందుకు రెక్కలు కట్టుకొని వాలారు.


దుబాయిలోని తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల సమాజం నిర్వహించిన కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమం ఆధ్యాత్మికతో పాటు వినోదభరితంగా జరిగింది. దేవతా వనాల మధ్య వేద శ్లోకాలతో, దీపారాధనతో ఆధ్యాత్మికత వెల్లివిరిసిన ఈ కార్యక్రమానికి తెలుగు వారి ఆత్మీయత కూడా తోడు కావడంతో సభికులు పరవశించిపోయారు. కార్యక్రమంలో దుబాయిలోని భారతీయ కాన్సుల్ జనరల్ ఇ. విష్ణువర్ధన్ రెడ్డి కూడా ప్రత్యేక శ్రద్ధతో పాల్గొనడంతో అందరు ఆనందించారు.

CA2.jpg


హనుమత్ కుమార్, గోపి ఆరె, సురేంద్ర నాయుడు, బలరాం వుచ్చిడి, శ్రీనివాస రావు ఎడరా, శ్రీనివాస రావు చెరుకూరి, రామకృష్ణా సుబ్రమణ్యం, జయకృష్ణా పత్తిపాటి, వెంకట్‌లు కార్యక్రమ నిర్వహణలో సహకరించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. దుబాయి, ఇతర ఎమిరేట్లలో పని చేస్తున్న అనేక మంది సీఏలు కుటుంబ సమేతంగా వచ్చి వనభోజనాలు చేసినట్లుగా కూడా వారు పేర్కొన్నారు.

Updated Date - Nov 23 , 2026 | 01:20 PM